Amazon Prime Video: యూజర్లకు అమెజాన్ షాక్.. ఇకపై మరింత వాయింపుడు.. ఆదాయార్జనే ధ్యేయంగా కొత్త విధానం..

| Edited By: Ram Naramaneni

Sep 28, 2023 | 10:18 PM

ఇప్పటి వరకూ యాడ్ లేకుండా కంటెంట్ ను అందిస్తున్న అమెజాన్ ఇకపై యాడ్ లతో కూడిన వీడియోలను అందించనుంది. ఒకవేళ యాడ్ ఫ్రీగా కంటెంట్ కావాలనుకుంటే మాత్రం అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో అమెజాన్ కూడా తన ఇతర పోటీ దారైన నెట్ ఫ్లిక్స్ సరసన చేరింది. నెట్ ఫిక్స్ కూడా ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తోంది.

Amazon Prime Video: యూజర్లకు అమెజాన్ షాక్.. ఇకపై మరింత వాయింపుడు.. ఆదాయార్జనే ధ్యేయంగా కొత్త విధానం..
Amazon Prime
Follow us on

ప్రస్తుతం అంతా ఓటీటీలదే హవా. కరోనా ప్యాన్ డెమిక్ దెబ్బతో అంతా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీనికి తోడు స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులోకి రావడం, అన్ని ప్రధాన ఎంటర్ టైన్ మెంట్ చానళ్లు, సంస్థలు యాప్ లను విడుదల చేస్తుండటంతో అంతా వీటిని వినియోగిస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ ఫారం లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా, జీ5 వంటి వాటిని మన దేశంలో ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే వీటిల్లో కొన్నింటిలో కంటెంట్ చూడాలంటే యాడ్స్ వస్తుంటాయి. కొన్ని యాడ్ ఫ్రీగా వస్తుంటాయి. మరికొన్ని యాప్స్ అదనపు చార్జీలు తీసుకొని యాడ్ ఫ్రీ కంటెంట్ ను అందిస్తాయి. కేవలం అదనపు ఆదాయం కోసమే ఓటీటీ సంస్థలు ఈ తరహా విధానాన్ని అవలంభిస్తాయి. ఇదే విధానాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకూ యాడ్ లేకుండా కంటెంట్ ను అందిస్తున్న అమెజాన్ ఇకపై యాడ్ లతో కూడిన వీడియోలను అందించనుంది. ఒకవేళ యాడ్ ఫ్రీగా కంటెంట్ కావాలనుకుంటే మాత్రం అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో అమెజాన్ కూడా తన ఇతర పోటీ దారైన నెట్ ఫ్లిక్స్ సరసన చేరింది. నెట్ ఫిక్స్ కూడా ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తోంది. 2024 నుంచి ఈ విధానాన్ని మొదటిగా అమెరికాలో పాటించనున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఓటీటీ పరిశ్రమలో గణనీయమైన మార్పును తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

యూజర్ల అదనపు భారం..

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఇది అదనపు భారం కానుంది. ఇప్పటి వరకూ యాడ్స్ లేకుండా కంటెంట్ ను ఆస్వాదించిన వినియోగదారులు ఇకపై యాడ్స్ తో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ యాడ్స్ లేకుండా కంటెంట్ కావాలంటే మాత్రం అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు యాడ్స్ కలిగిన మెంబర్ షిప్ నకు ఒక రేటు.. యాడ్స్ లేకుండా ఉండే మెంబర్ షిప్ నకు మరో రేటు వసూలు చేస్తున్నాయి. అయితే అమెజాన్ మాత్రం వాణిజ్య ప్రకటనలను వీడియోలలో యాడ్ చేసినప్పటికీ ప్రైమ్ మెంబర్ షిప్ రుసుములో ఎటువంటి మార్పు చేయలేదు.

ఈ కొత్త విధానాన్ని అమెరికాలో 2024 నుంచి అమలు చేయనున్నారు. కాగా యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం వినియోగదారులు 2.99డాలర్లు మన కరెన్సీలో రూ. 248లను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాతో పటు యూఎస్, యూకే, జర్మనీ, కెనడా వంటి దేశాల్లో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియాల్లో యాడ్స్ కంటెంట్ ను అమెజాన్ తీసుకురానుంది. ఒక్కసారి ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయితే వినియోగదారులు తమ స్ట్రీమింగ్లో యాడ్స్ చూస్తారు. అయితే ఇది అందుబాటులోకి వచ్చే ముందు వినియోగదారులు తమ ఈ-మెయిల్స్ లో దీనికి సంబంధించిన వివరాలతో ఓ మెయిల్ వస్తుంది. దానిలో యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం సైన్ అప్ చేసే ఆప్షన్ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో తక్కువ ధరకే..

అమెజాన్ ప్రైమ్ కొత్త విధానం నెట్‌ఫ్లిక్స్ అడుగుజాడలను అనుసరిస్తుంది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో దాని చెల్లింపు సభ్యత్వాలకు కొన్ని మార్పులను చేసింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి, నెట్‌ఫ్లిక్స్ దాని సాధారణ ప్లాన్‌ల కంటే సరసమైన నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లు భారతదేశంలో ఇంకా అందుబాటులో లేనప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికీ దాని భారతీయ వినియోగదారుల కోసం మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా ఇదే విధమైన సరసమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లైట్‌ను పరిచయం చేసింది. ఇది వారి ప్రామాణిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కన్నా మరింత సరసమైన, సరళీకృత వెర్షన్. రూ. 999 ధరతో, అమెజాన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..