Amazon Offer: ఆ 5జీ ఫోన్‌ని సగం ధరకే దక్కించుకోవచ్చు.. త్వరపడండి..

|

Aug 16, 2024 | 5:46 PM

అన్ని ఫీచర్లు కలిగిన 5జీ స్మార్ట్ ఫోన్ కావాలంటే కనీసం సుమారు రూ.20 వేలు ఖర్చుపెట్టాలి. అదే మరో పది వేలు వెచ్చించి రూ.30 వేలు ఖర్చుచేయగలిగితే మరింత మెరుగైన స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. అయితే ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. దాదాపు రూ.30 వేలు విలువైన ఫోన్ కేవలం రూ.17 వేలకే దొరుకుతోంది.

Amazon Offer: ఆ 5జీ ఫోన్‌ని సగం ధరకే దక్కించుకోవచ్చు.. త్వరపడండి..
Tecno Camon 5g
Follow us on

ఈ రోజుల్లో అన్ని ఫీచర్లు కలిగిన 5జీ స్మార్ట్ ఫోన్ కావాలంటే కనీసం సుమారు రూ.20 వేలు ఖర్చుపెట్టాలి. అదే మరో పది వేలు వెచ్చించి రూ.30 వేలు ఖర్చుచేయగలిగితే మరింత మెరుగైన స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. అయితే ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. దాదాపు రూ.30 వేలు విలువైన ఫోన్ కేవలం రూ.17 వేలకే దొరుకుతోంది. అంటే దాదాపు సగం తగ్గింపు ధరకే లభిస్తోంది. టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ ఈ ధరకు అందుబాటులో ఉంది.

భారీ డిస్కౌంట్..

అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్ పై అందుబాటులో ఉన్న టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ అసలు ధర రూ. 29,999. ఈ ఫోన్ 2023లో ఈ ధరలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ లో రూ.17 వేలకు అందుబాటులో ఉంది. 512 జీజీ స్టోరేజ్, మీడియా టెక్ డైమెన్సిటీ 8050, 108 ఎంపీ అల్ట్రావైడ్ – మాక్రో లెన్స్, సెన్సార్ – షిఫ్ట్ ఓయిస్ కెమెరా, లెదర్ డిజైన్‌ తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.

బెస్ట్ ఆఫర్..

తక్కువ ధరకు మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకువారికి ఇది మంచి అవకాశం. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ ఫోన్ ధర దాదాపు రూ.13 వేలు తగ్గిపోయింది. ఫోన్లపై ఇస్తున్న ఆఫర్లలో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంత భారీగా డిస్కౌంట్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. తక్కువ ధరతో పాటు దీనిలో అనేక స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించారు.

తగ్గింపు వర్తించే విధానం..

టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ (8 జీబీ+ 512 జీబీ) స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.29,999. ఈ ఫోన్ డార్క్ వెల్కిన్, సెనిటరీ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లో కూపన్ క్యాష్‌యాక్ ద్వారా రూ. 6 వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ల ద్వారా రూ. వెయ్యి వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇతర ఆఫర్లకు సంబంధించి స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 22,500 వరకూ తగ్గింపు పొందవచ్చు.

ప్రత్యేకతలు..

ఈ ఫోన్ లో 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోలెడ్ 10 బిట్ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ప్రీమియర్ లెదర్ డిజైన్‌ ఆకట్టుకుంటోంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌తో ఆడ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. 45 డబ్ల్యూకు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ గంటల చార్జింగ్ వస్తుంది. వీటితో పాటు సెన్సార్ షిష్ట్ ఓఐఎస్ , లేజర్ ఫోకస్‌తో కూడిన 50 ఎంపీ ప్రినరీ లెన్స్, 108 ఎంపీ అల్ట్రావైడ్\మాక్రో, 2 ఎంపీ బోకెన్ లెన్స్‌ అమర్చారు. వెనుక భాగంలో రింగ్ ఫ్లాష్‌లైట్, 32 ఎంపీ సెల్ఫీ షూటర్‌ ఉన్నాయి. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..