Amazon Sale: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇయర్ బడ్స్‌పై ఏకంగా 75శాతం వరకూ డిస్కౌంట్..

|

Jun 19, 2023 | 5:00 PM

వైర్ ఉన్న ఇయర్ ఫోన్లతో విసిగిపోయారా? ఏదైనా మంచి బ్రాండ్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అంతర్జాతీయ మ్యూజిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ వరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ సేల్ ను ప్రారంభించింది. దీనిలో ఆడియో ప్రాడక్ట్స్ పై అదిరే ఆఫర్లను ప్రకటించింది.

Amazon Sale: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇయర్ బడ్స్‌పై ఏకంగా 75శాతం వరకూ డిస్కౌంట్..
Ear Buds
Follow us on

వైర్ ఉన్న ఇయర్ ఫోన్లతో విసిగిపోయారా? ఏదైనా మంచి బ్రాండ్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అంతర్జాతీయ మ్యూజిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ వరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ సేల్ ను ప్రారంభించింది. దీనిలో ఆడియో ప్రాడక్ట్స్ పై అదిరే ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్, సోనీ, బోట్ వంటి అనేక టాప్ బ్రాండ్లు దీనిలో ఉన్నాయి. అమెజాన్ డిస్కౌంట్ మాత్రమే కాక ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్స్ పై కొనుగోలు చేస్తే మరో 10శాతం తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 21 వరకూ మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎం5.. ఈ హెడ్ ఫోన్లపై మీకు అమెజాన్ లో 23శాతం ఆఫర్ ఉంది. దీనింలో ఎనిమిది మైక్ లు ఉంటాయి. 40 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ఉంటుంది. ఏఎన్సీ, వీ1 ప్రాసెసర్ ఉంటుంది. మన దేశంలో దీని ప్రారంభ ధర రూ. 26,990గా ఉంది.

బోట్ ఎయిర్ డోప్స్ అటమ్ 81.. ఈ ఎయిర్ డోప్స్ పై ఏకంగా 78శాతం ఆఫర్ అమెజాన్ లో ఉంది. దీనిలో స్పోర్ట్స్ 13ఎంఎం డ్రైవర్స్, బ్లూటూత్ 5.3, ఏఎస్ఏపీ చార్జ్, 10 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎయిర్ డోప్స్ ప్రారంభ ధర రూ. 999గా ఉంది.

ఇవి కూడా చదవండి

స్కల్ క్యాండీ డైమ్.. ఈ బ్రాండ్ ఇయర్ ఫోన్లపై 73శాతం వరకూ ఆఫర్ ఉంది. ఇది 12 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అలాగే దీనికి ఐపీఎక్స్4 రేటింగ్ ఉంది. పలు రకాల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,999గా ఉంది.

రెడ్ మీ బడ్స్ 4 యాక్టివ్.. కొత్త లాంచ్ అయిన ఈ బడ్స్ కూడా ఆఫర్లో లభిస్తున్నాయి. రూ. 1,199 ప్రారంభ ధరతో ఇది అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్, 30 గంటల వరకూ బ్యాటరీ లైఫ్, 12ఎంఎం డ్రైవర్స్ ఉంటాయి.

బోనస్ డీల్స్..

ఇయర్ ఫోన్స్ కాకుండా వివిధ రకాల సౌండ్ బార్లపై కూడా అద్భుతమైన ఆఫర్లు అమెజాన్ లో ఉన్నాయి. సోనీ హెచ్టీ ఎస్ 40ఆర్ 5.1 సౌండ్ బార్ పై 29శాతం డిస్కౌంట్ పై రూ. 24,990కు లభిస్తోంది. జెబ్రానిక్స్ జెబ్ జ్యూక్ బార్ 9500డబ్ల్యూఎస్ ప్రోపై 67శాతం డిస్కౌంట్ తో రూ. 15,999కే లభిస్తోంది. ఇటువంటి అనేకమైన ఆఫర్లు ఉన్నాయి. వాటిపై కూడా ఓలుక్ వేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..