Smart tv: స్మార్ట్ టీవీలపై ఇలాంటి ఆఫర్స్‌ మరెప్పుడు ఉండవు.. ఏకంగా 50శాతం డిస్కౌంట్‌.

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అందిస్తున్న ఆఫర్స్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. అమెజాన్‌ ప్రస్తుతం గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌ ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌ సైట్‌లో...

Smart tv: స్మార్ట్ టీవీలపై ఇలాంటి ఆఫర్స్‌ మరెప్పుడు ఉండవు.. ఏకంగా 50శాతం డిస్కౌంట్‌.
Smart tv
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 28, 2023 | 3:37 PM

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. భారీ స్క్రీన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. లార్జ్‌ స్క్రీన్‌ టీవీలను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకప్పుడు స్మార్ట్ టీవీల ధరలు ఆకాశాన్ని తాకేవి. కానీ ప్రస్తుతం స్మార్ట్ టీవీల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చైనాకు చెందిన షావోమీ వంటి బ్రాండ్స్‌ మాత్రమే కాకుండా సోనీ, సామ్‌సంగ్‌ వంటి బ్రాండ్స్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అందిస్తున్న ఆఫర్స్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. అమెజాన్‌ ప్రస్తుతం గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌ ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌ సైట్‌లో ఏయే స్మార్ట్ టీవీలపై ఎంత డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Sony

Sony Bravia 43 inches: ప్రముఖ బ్రాండ్ సోనీకి చెందిన ఈ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 69,900కాగా, 44 శాతం డిస్కౌంట్‌పోను రూ. 39,490కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ గూగుల్ టీవీలో ఈ యూఎస్‌బీ పోర్ట్స్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 20 వాట్స్‌ అవుట్‌పుట్‌ డాల్బీ ఆడియో స్పీకర్‌ను ఇచ్చారు. వాయిస్ సెర్చ్‌, అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీపై మూడేళ్ల వారంటీని ఇస్తున్నారు.

Xiaomi

Xiaomi 43 inches: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమీకి చెందిన ఈ 43 ఇంచెస్‌ టీవీ అసలు ధర రూ. 42,999కాగా, 43 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్స్‌ పొందొచ్చు. ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఈ టీవీలో 4కే రిజల్యూషన్ అందించారు. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌లకు ఈ టీవీ సపోర్ట్ ఛేస్తుంది. 30 వాట్స్‌ అవుట్ పుట్ డాల్బీ ఆడియోను అందించారు. ఏడాది వారంటీని అందిస్తున్నారు.

Oneplus

OnePlus 50 inches: వన్‌ప్లస్‌ 50 ఇంచెస్‌ టీవీపై కూడా భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీని రూ. 31,890కే సొంతం చేసుకోవచ్చు. ఇక 43 ఇంచెస్‌ టీవీని రూ. 24,999కి లభిస్తుంది. ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్‌డీ బెజల్‌ లెస్‌ డిస్‌ప్లేను అందించారు. 1 బిలియన్‌ కలర్స్‌కి ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో, హాట్‌ స్టార్‌, సోనీ లివ్‌, హంగామా, జియో సినిమాతో పాటు మరికొన్ని ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

Acer

Acer 50 inches: అసర్‌ కంపెనీకి చెందిన ఈ 50 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 49,999కాగా 48 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 25,999కే సొతం చేసుకోవచ్చు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పనిచేసే ఈ టీవీలో 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. డ్యూయల్ బాండ్ వైఫై, 2 వే బ్లూటూత్‌, బ్లూరే స్పీకర్‌తో పాటు 36 వాట్స్‌ అవుట్‌పుట్‌ డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌ను అందించారు. డాల్బీ విజన్‌ ఈ టీవీ సొంతం.

Samsung

Samsung 43 inches: సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన ఈ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 52,900కాగా 46 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 28,490కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ ఫోన్‌లో 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్స్‌ను ఇచ్చారు. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేసే ఈ టీవీలో 20 వాట్స్‌ అవుట్‌పుట్‌ సౌండ్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?