Amaze fit: భారతమార్కెట్లోకి అమేజ్‌ఫిట్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌.. గుండె ఆరోగ్యంపై అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతుంది

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం అమేజ్‌ ఫిట్‌ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. జీటీఆర్‌ మినీ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ముఖ్యంగా 24 గంటల హెల్త్‌..

Amaze fit: భారతమార్కెట్లోకి అమేజ్‌ఫిట్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌.. గుండె ఆరోగ్యంపై అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతుంది
Gtr Mini Smartwatch

Updated on: Mar 19, 2023 | 2:44 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం అమేజ్‌ ఫిట్‌ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. జీటీఆర్‌ మినీ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ముఖ్యంగా 24 గంటల హెల్త్‌ మానటరింగ్ ఫీచర్‌ను అందించారు. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే.. హార్ట్‌ రేట్‌లో హెచ్చతగ్గులు, స్ట్రెస్‌ లెవల్స్‌తో యూజర్లను అలర్ట్‌ చేస్తుంది. అంతేకాదు ఒత్తిడి తగ్గించుకునేందుకు ఎక్సర్‌సైజ్‌లు చేయమని సూచిస్తుంది కూడా.

ఇక రౌండ్ డ‌య‌ల్‌, స్లిమ్ ప్రొఫైల్‌తో 120ప్ల‌స్ స్పోర్ట్స్ మోడ్స్‌, హార్ట్‌రేట్‌, ఎస్‌పీఓ2 వంటి అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిట‌రింగ్ ఫీచ‌ర్ల‌ను అందించారు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 10,999గా ఉంది. అమేజ్‌ఫిట్ జీటీఆర్ మిని 1.28 ఇంచ్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లేతో బ‌యోట్రాక‌ర్‌పీపీజీ ఆప్టిక‌ల్ సెన్స‌ర్ వంటి ఫీచర్లను అందించారు.

వీటితో రియ‌ల్ టైమ్‌లో హార్ట్ రేట్‌, బ్ల‌డ్‌-ఆక్సిజ‌న్ శాచురేష‌న్‌, స్ట్రెస్ లెవెల్‌ల‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. దీంతో పాటు బ్యాటరీకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్యాటరీ లైఫ్‌ విషయంలో ఈ స్మార్ట్‌వాచ్‌ను మరే వాచ్‌ బీట్‌ చేయలేదని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు నిర్వీరామంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..