ప్రపంచంలో అత్యధిక మంది వినియోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. అది అందించే కచ్చితమైన సమాచారం, సెర్చింగ్ లో ఫ్లెక్సిబులిటీ కారణంగా దీనిని అందరూ వినియోగిస్తారు. కొంతమంది వినియోగదారులు కొన్ని ఎక్స్ టెన్షన్స్ ని వాడుతూ సెర్చింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఎక్స్ టెన్షన్స్ వెబ్ బ్రౌజర్స్ పని తీరును మరింత మెరుగుపరుస్తాయి. అయితే కొన్ని ఎక్స్ టెన్షన్స్ ఇప్పుడు వినియోగదారులకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యూజర్లకు సంబంధించిన డేటాను దొంగిలిస్తున్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ ఎక్స్ టెన్షన్స్ వెంటనే డిలీట్ చేయాలని చెబుతున్నారు. ఆ ఎక్స్ టెన్షన్స్ ఎంటి చూద్దాం రండి..
క్రోమ్ వెబ్ స్టోర్ లోని కొన్ని ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్ గురించి తాజాగా యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అవాస్ట్ వెల్లడించింది. అవి మన సిస్టమ్ లోకి యాడ్ వేర్ లను పంపించడం, సెర్చ్ రిజల్ట్ ను తారుమారు చేయడం చేస్తుంటాయని పేర్కొంది. వీటిల్లో క్రోబ్ వెబ్ స్టోర్ లో ఉన్న పీడీఎఫ్ టూల్ బాక్స్ ఎక్స్ టెన్షన్ ఎంత ప్రమాదరకమైనదన్న విషయాన్ని ఇటీవల సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వ్లాదిమిర్ పాలంట్ వివరించారు. ఇలాంటి ఎక్స్ టెన్షన్స్ క్రోమ్ వెబ్‌స్టోర్‌లో సుమారు 32 వరకు ఉన్నాయని అవస్ట్ పేర్కొంది. అయితే, ఈ ఎక్స్‌టెన్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. వీటిలో యాడ్ బ్లాకర్స్, డౌన్ లోడర్స్, బ్రౌజర్ థీమ్స్, రికార్డర్స్, ట్యాబ్ మేనేజర్స్ తదితర ఎక్స్ టెన్షన్స్ ఉన్నాయని వెల్లడించింది.
ఈ ఎక్స్ టెన్షన్స్ మొదట్లో ఉపయోగకరంగా, ఎలాంటి ముప్పు లేని వాటిగా కనిపిస్తాయి. అయితే, వాటిలో దాగిఉన్న ప్రమాదకర కోడ్ తోనే ముప్పు ఉంటుంది. ఈ ఎక్స్ టెన్షన్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ మనం వెబ్ లో సెర్చ్ చేసే విషయాల గురించి తెలుసుకుంటాయి. దాంతో, కుప్పలు తెప్పలుగా ఆ సెర్చెస్ కు సంబంధించిన యాడ్స్ ను పంపిస్తాయి. అలాగే, సెర్చ్ రిజల్ట్ ను తారుమారు చేయడం, పెయిడ్ యాడ్స్ ను, స్పాన్సర్డ్ లింక్స్, డేంజరస్ లింక్స్ ను పంపించడం చేస్తుంటారు. అయితే, ఈ డేంజరస్ ఎక్స్ టెన్షన్స్ ను చాలావరకు గూగుల్ తొలగించి వేస్తుంది.ఇ ప్పటికవే సుమారు 50 ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్ ను ఇప్పటికే క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి తొలగించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..