Airtel Users Details Leaked: హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఎయిర్‌టెల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంపై పడ్డారు. ఏకంగా 25 లక్షల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు.
వివరాల్లోకి వెళితే… ఎయిరల్ టెల్ సిమ్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తుల మొబైల్ నెంబర్లతో పాటు, వారి ఆధార్ నెంబర్, నివసిస్తున్న ప్రదేశంతోపాటు జెండర్‌కు సంబంధించిన వివరాలను కొంతమంది హ్యాకర్లు నెట్టింట్లో అమ్మకానికి పెట్టేశారు. ఇంతటితో ఆగని హ్యాకర్లు భారతదేశంలోని అందరు ఎయిర్‌టెల్ యూజర్ల సమాచారం తమ దగ్గర ఉందని, ఆ ఇన్ఫర్మేషన్‌ను కూడా అమ్మకానికి పెడతామని చెప్పడం గమనర్హం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజశేఖర్ రాజహర్యా అనే ఇంటర్నెట్ సెక్యురిటీ రీసెర్చర్ ఈ వివరాలను వెల్లడించారు. పెద్ద మొత్తంలో యూజర్ల డేటాను తస్కరించిన హ్యాకర్లు.. ఎయిర్‌టెల్ సెక్యురిటీ టీమ్‌తో 3500 డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్స్ ఇవ్వమని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విఫలం కావడంతో ఆ సమాచారాన్ని నెట్టింట అమ్మకానికి పెట్టేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి యూజర్ల సమాచారాన్ని కొంతమేర పోస్ట్ చేశారు. అయితే ఈ సమాచారం ఎయిర్‌టెల్ సర్వర్ల నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా హ్యాకర్లు సేకరించినట్లు సమాచారం. జమ్మ కశ్మీర్‌కు చెందిన యూజర్ల సమాచారం పెద్ద మొత్తంలో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలియజేసిన రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశాడు. మరి ఎయిర్‌టెల్ సంస్థ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Another Big Data Breach? A Hacker Group alleged uploaded “shell” in @airtelindia Server. Now selling all India Airtel subscribers data including Aadhaar Number. Posted 2.5 Million as sample data. (in Jan 2021)#InfoSec #DataLeak #GDPR #databreaches #dataprotection #DataPrivacyDay pic.twitter.com/uxWopfKU0M
— Rajshekhar Rajaharia (@rajaharia) February 2, 2021