పోర్ట్రెయిట్స్‌లో కృత్రిమ నవ్వులు ఎలా..?

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2019 | 2:46 PM

సెల్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ.. విదేశీ సంస్థలు కొత్త కొత్త యాప్‌లతో వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం అంతటా ఫేస్‌యాప్ హంగామా నడుస్తుండగా.. తాజాగా మరో యాప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనకు చెందిన ఫొటోలను పాతకాలపు పెయింట్‌లా ఆ యాప్ మార్చేస్తోంది. ఏఐ పోర్ట్రెయిట్స్‌లో వచ్చిన ఈ యాప్‌ ఇప్పుడు సెల్‌ఫోన్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే పాతకాలంలో మన ఫొటోను పెయింటింగ్‌గా మార్చుకోవాలనుకుంటే చాలా సమయం పట్టేది. దాదాపు కొన్ని గంటల పాటు మనం కదలకుండా […]

పోర్ట్రెయిట్స్‌లో కృత్రిమ నవ్వులు ఎలా..?
Follow us on

సెల్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ.. విదేశీ సంస్థలు కొత్త కొత్త యాప్‌లతో వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం అంతటా ఫేస్‌యాప్ హంగామా నడుస్తుండగా.. తాజాగా మరో యాప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనకు చెందిన ఫొటోలను పాతకాలపు పెయింట్‌లా ఆ యాప్ మార్చేస్తోంది. ఏఐ పోర్ట్రెయిట్స్‌లో వచ్చిన ఈ యాప్‌ ఇప్పుడు సెల్‌ఫోన్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది.

అయితే పాతకాలంలో మన ఫొటోను పెయింటింగ్‌గా మార్చుకోవాలనుకుంటే చాలా సమయం పట్టేది. దాదాపు కొన్ని గంటల పాటు మనం కదలకుండా కూర్చోవాల్సి ఉండేది. అంతేకాదు అందులో నవ్వుతో కూడిన పెయింటింగ్‌ను చేయడం చాలా కష్టం. అయితే ఇప్పుడొచ్చిన ఈ యాప్ ద్వారా కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో మన ఫొటోలను పాతకాలపు పెయింటింగ్‌లా మార్చుకోవచ్చు. వాటితో పాటు ఆ పెయింటింగ్‌లకు నవ్వును కూడా యాడ్ చేయొచ్చంటూ ఏఐ పోర్ట్రెయిట్స్‌ తయారీసంస్థ తెలిపింది. ఈ యాప్ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని వారు ధీమాను వ్యక్తపరుస్తున్నారు.