Aadhaar-Ration Card Link: మీ రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేశారా? సులభమైన ఈ మూడు పద్దతుల్లో చేసుకోండి

|

Oct 27, 2021 | 8:38 PM

Aadhaar-Ration card Link: దేశవ్యాప్తంగా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం..

Aadhaar-Ration Card Link: మీ రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేశారా? సులభమైన ఈ మూడు పద్దతుల్లో చేసుకోండి
Aadhaar Ration Card Link
Follow us on

Aadhaar-Ration card Link: దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ధరకే మంచి ఆహారాన్ని పొందవచ్చు.

అయితే రేషన్ కార్డును ఆధార్‌కి లింక్ చేయడం తప్పనిసరి. ఇలా లింక్‌ చేయడం వల్ల మరిన్ని బెనిఫిట్‌ పొందవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అయినా రేషన్ పొందవచ్చు. రేషన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని అధికారులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. లబ్దిదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు.

ఆన్‌లైన్ విధానంలో..
ఆధార్‌కు రేషన్‌ కార్డును లింక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ఓపెన్ చేయాలి. వెబ్ పేజీలో కనిపించే ‘స్టార్ట్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో అడిగే చిరునామా, రాష్ట్రం, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ‘రేషన్ కార్డ్ బెనిఫిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. వెబ్ పేజీలో ఓటీపీని నమోదు చేసిన తర్వాత .. ఈ ప్రక్రియ పూర్తయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అనంతరం ఆధార్ ధృవీకరణ పూర్తయ్యి రేషన్ కార్డుతో లింక్ అవుతుంది.

ఆఫ్‌లైన్‌ ద్వారా..
ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఆధార్ నెంబర్, రేషన్ నెంబర్ లింక్ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను రేషన్ కార్డు కేంద్రంలో అందించడం ద్వారా కూడా ఈ పని చేసుకోవచ్చు. లబ్ధిదారులు ఆఫ్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్ కార్డును అనుసంధానం చేయవచ్చు. ఇక రేషన్ కార్డు కేంద్రంలో ఆధార్ డేటా బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ కూడా చేయవచ్చు. దీంతో సంబంధిత అధికారి విభాగానికి ఈ దరఖాస్తును పంపిస్తారు. అధికారులు అన్ని వివరాలను పరిశీలించిన తరువాత.. ఆధార్‌కు రేషన్ కార్డు అనుసంధానం పూర్తయినట్లు లబ్ధిదారులకు మెసేజ్ వస్తుంది.

ఎస్‌ఎంఎస్‌ (SMS) ద్వారా..
ఎస్‌ఎంఎస్‌ SMS) ద్వారా కూడా రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు లబ్ధిదారుడు UID SEED అని టైప్ చేసి స్టేట్ షార్ట్ కోర్డ్ టైప్ చేసి ప్రోగ్రామ్ కోడ్ టైప్ చేసి స్కీమ్ ఐడీ టైప్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేసి 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు: UID SEED MH POSC 9876543 123478789012 అని టైప్ చేయాలి. ఈ విధానాల వల్ల రేషన్‌ కార్డుకు ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

SBI Holders: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.342 చెల్లిస్తే.. రూ.4 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..!

Fuel Price: నాన్‌స్టాప్‌గా పరుగెడుతున్న పెట్రోల్‌ ధర.. అక్కడ మాత్రం యమ స్పీడు.. ఏకంగా లీటర్‌ ధర రూ.120 దాటింది..!