ATM Cash Withdrawal: కార్డు అవసరం లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు… ఎలాగంటే..!

| Edited By: Ram Naramaneni

Apr 15, 2021 | 8:58 AM

ATM Cash Withdrawal: రోజురోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటాము. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది...

ATM Cash Withdrawal: కార్డు అవసరం లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు... ఎలాగంటే..!
Atm
Follow us on

ATM Cash Withdrawal: రోజురోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటాము. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సామాన్యుల అవసరాలు చాలా సులువుగా తీరిపోతున్నాయి. ఇప్పుడు డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కార్డు కూడా అవసరం లేకుండా పోయింది. అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు సంబంధించిన యాప్‌ ఉంటే చాలు. అందులో డబ్బులు ఎంటర్‌ చేసి ఏటీఎంలో పిన్‌ ఎంటర్ చేస్తే చాలు. నగదు వచ్చేస్తుంది. అంతేకాదు ఇకపై బ్యాంకింగ్‌ యాప్స్‌ కూడా అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌ ఉంటే చాలు. మీరు షాపింగ్‌ చేసినప్పుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పేమెంట్‌ చేసినట్లు, ఏటీఎంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ మీరు ఉపయోగించేందుకు ఎంతకాలమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ టెక్నాలజీ రానుంది.

ఏటీఎం తయారు చేసే ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ మొదటిసారి ఇంటర్‌ ఆపరెబుల్‌ కార్డ్ లెస్‌ క్యాష్‌ విత్‌ డ్రాయల్‌ (ICCW) విధానాన్ని లాంచ్‌ చేసింది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ అంటే యూపీఐ ప్లాట్‌ ఫామ్‌పై ఇది పని చేస్తోంది. ఎన్‌సీఆర్‌తో చేతులు కలిపిన సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఈ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఇప్పటికే 1.500 ఏటీఎంలను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ ఏటీఎంలలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం, యాప్‌ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ, ఆ యాప్‌కు మీ బ్యాంక్‌ లింక్‌ అయి ఉంటే చాలు. డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

గూగుల్‌ పే, ఫోన్‌ పే, ఇతర యాప్‌ల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఎలా పేమెంట్స్‌ చేస్తున్నారో ఇకపై ఏటీఎంలో కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అంటే ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను చూపీఐ యాప్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో స్కాన్‌ చేయాలి. ఆ తర్వాత ఎంత మొత్తం కావాలో ఎంటర్‌ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్‌తో క్యాష్‌ విత్‌డ్రా చేసుకునే అవకాశం సిటీ యూనియన్‌ బ్యాంకుకు చెందిన 1500 ఏటీఎంలలో మాత్రమే ఉంది. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని తమ కస్టమర్లకు ఇలాంటి సర్వీసు అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇవీ చదవండి: LPG Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? రూ.50 లక్షల వరకు బెనిఫిట్‌.. ఎలాగంటే..!

PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..