Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 38 వేల ఫోన్‌ను రూ. 15,499కే సొంతం చేసుకునే అవకాశం..

|

Nov 08, 2022 | 3:05 PM

ఆకర్షణీయమైన డీజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన నథింగ్‌ ఫోన్‌ టెక్‌ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ నథింగ్ ఫోన్‌1 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి...

Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 38 వేల ఫోన్‌ను రూ. 15,499కే సొంతం చేసుకునే అవకాశం..
Nothing Phone 1 Offer
Follow us on

ఆకర్షణీయమైన డీజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన నథింగ్‌ ఫోన్‌ టెక్‌ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ నథింగ్ ఫోన్‌1 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌కు భారీ క్రేజ్‌ దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫోన్‌పై ప్రముఖ ఈకామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సగం ధరకే ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఇంతకీ ఆఫర్‌లో ఈ ఫోన్‌ను ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోవాలంటే..

నథింగ్‌ ఫోన్‌ 1 12 జబీ ర్యామ్‌/256 జీబీ వేరియంట్ ఫోన్‌ అసలు ధర రూ. 37,999గా ఉంది. అయితే దీనిపై క్యాష్‌బ్యాక్‌/కూపన్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్ రూ. 5000 డిస్కౌంట్‌ అందిస్తోంది.దీంతో పాటు పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేయడం ద్వారా రూ. 17,500 తగ్గింపు ధర పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌పై అన్ని ఆఫర్లను కలిపి కనిష్టంగా రూ. 15,499కే సొంతం చేసుకునే అవకాశం దక్కనుంది. అయితే ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగలేదండీ.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బాక్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం డిస్కౌంట్‌తోపాటు, ₹ 6,699 విలువైన గూగుల్ ఆడియోను ఇస్తోంది.

నథింగ్ ఫోన్‌ 1 ఫీచర్లు..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీని అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ అదనపు ఆకర్షణ. స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫొన్‌ సొంతం. ఈ ఫోన్‌ను 8 జీబీ/128 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..