టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫోల్డబుల్ వేరియంట్ ఫోన్లలో శామ్సంగ్ కంపెనీ ఫోన్లు ముందంజలో ఉన్నాయి. రెండు మూడు రకాల మోడళ్లలో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చే
ఇప్పుడు ఇదే క్రమంలో లెనోవా సొంతం చేసుకున్న మోటోరోలా కంపెనీ కూడా తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ టీజర్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.నెక్ట్స్ జెన్ రాజ్ఆర్(next-gen Razr)పేరిట దీనిని విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది. జూన్ ఒకటో తేదీన నిర్వహించనున్న ‘ఫ్లిప్ ది స్క్రిప్ట్’ ఈవెంట్ లో ఈ ఫోల్డబుల్ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ఆ టీజర్ లో పేర్కొంది. మోటో రాజ్ఆర్ 40 అల్ట్రా, అలాగే తక్కువ ధరలో లభించే మోటా రాజ్ఆర్ 40 ని కూడా అదే రోజు లాంచ్ చేయనున్నట్లు వివరించింది.
ఈ ఫోన్ బయటివైపు అధిక స్థలంతో కూడిన పెద్ద డిస్ ప్లే ఉంటుంది. ఇది 2022లో వచ్చిన రాజ్ఆర్ మోడల్ కన్నా పెద్దగా ఉంటుంది. అలాగే దాని కన్నా అధిక రిఫ్రెష్మెంట్ రేట్ ఉండే అవకాశం ఉంది.
కొన్ని రిపోర్టుల ఆధారంగా అధిక ధర ఉండే మోటో రాజ్ ఆర్ 40 అల్ట్రా ఫోన్ మూడు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 చిప్ సెట్ తో రానుంది. అలాగే మరో మోడల్ మోటో రాజ్ఆర్ 40 లో బయట డిస్ ప్లే కాస్త చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. అలాగే మొదటి మోడల్ తో పోల్చుకుంటే అదే విధమైన స్పెసిఫికేషన్లు ఉండే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా వెలువరించలేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..