దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలో 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రాగా.. తమ ప్రాంతంలో ఎప్పుడు ఈ సేవలు ప్రారంభం అవుతాయనే ఆసక్తి మొబైల్ వినియోగదారుల్లో నెలకొంది. 5జీ సేవలు కొత్త అనుభూతిని కల్పించడంతో పాటు, ఇటంర్నెట్ స్పీడ్ 4జీ తో పోలిస్తే 5జీ వంద రెట్ల వేగంతో పనిచేయనుంది. ఉదాహరణకు 10జీబీ ఫైల్ ను ఒక సెకండ్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో మొబైల్ వినియోగదారులంతా 5జీ సేవలం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు కొంటున్న వారంతా 5జీ సపోర్ట్ చేసే ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 6 నెలల్లోనే 200కి పైగా నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో అంటే 2024 నాటికి దేశంలో 80 నుంచి 90 శాతం ప్రాంతాలకు 5జీ టేక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2023 ఆగష్టు 15 నాటికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ ఎన్ ఎల్ కూడా 5జీ సేవలను ప్రారంభించనుందని తెలిపారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయని కేంద్రమంత్రి మరో గుడ్ న్యూస్ చెప్పారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న ఆనందం ఒకవైపు అయితే 5జీ సేవల ధరలు ఎలా ఉంటాయనే ఆందోళన సామాన్య మొబైల్ వినియోగదారుల్లో నెలకొంది. అలాంటి సందేహలను నివృత్తి చేస్తూ.. అందుబాటు ధరల్లోనే 5జీ సేవలు ఉంటాయని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5జీ సేవలను భారత్ లో ప్రారంభింస్తూ కీలక అంశాలను ప్రస్తావించిన విషం తెలిసిందే. 5జీ సేవల ప్రారంభం సందర్భంగా 21వ శతాబ్ధాపు భారత దేవానికి ఇది చారిత్రాత్మక రోజు అని, ఈరోజు అందుబాటులోకి వచ్చిన సేవలు దేశ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు రోజుల పాటు జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022ను ప్రారంభించిన సందర్భంగా 5జీ సేవలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తూ 5జీ వల్ల కలిగే ప్రయోజనాలను, దేశంలో సాంకేతిక విప్లవానికి ఈ సేవలు ఎలా ఉపయోగపడతాయనే విషయాలను వివరించారు. డిజిటల్ ఇండియా ఉద్యమానికి 5జీ సేవలు మరింత మద్దతు ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తు చేశారు. మరోవైపు దేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీపై ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 వరకు భారత్ మొబైల్ ఫోన్లను 100% దిగుమతి చేసుకునేదని, దీంతో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మొబైల్ తయారీ రంగంలో స్వయం సమృద్ది సాధించాలని నిర్ణయించామని, దీంతో దేశంలో ఇప్పుడు 200 మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు. 2014లో భారత్ లో కేవలం 25 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 85 కోట్లకు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. ఇంటర్నెట్ వినియోగదారులకు 5జీ తో ఎంతో ప్రయోజనం కలగనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ను తొలుత చాలా మంది ఎగతాళి చేశారని, అయినా సరే తాము దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లామన్నారు. 8 సంవత్సరాల క్రితం రెండు మొబైల్ తయారీ యూనిట్లు దేశంలో ఉంటే వాటి సంఖ్య ప్రస్తుతం 200కు చేరిందని తెలిపారు. దేశంలో తయారైన మొబైల్ ఫోన్లను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.
5జీ సేవలు అందుబాటులోకి రావడంతో దేశం కొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు. డిజిటల్ కనెక్టవిటీ మరింత పెరగనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. మొత్తం మీద మరో 6 నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానుండగా.. మరో రెండు సంవత్సరాల్లో దాదాపు దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..