Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

|

Jul 30, 2021 | 6:57 AM

Black Hole Theory: చెప్పింది నిజమైంది.. అవునూ.. కృష్ణ బిలాల వెనుక ఉండే కాంతి ప్రతి ధ్వనులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని ఐన్‌స్టీన్‌ ఏనాడో చెప్పడంతో మరోసారి ఆయన మేధస్సుకు సలాం చేస్తున్నారు. 

Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..
Black Hole Theory
Follow us on

ఐన్‌స్టీన్‌ చెప్పింది నిజమైంది.. అవునూ.. కృష్ణ బిలాల వెనుక ఉండే కాంతి ప్రతి ధ్వనులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని ఐన్‌స్టీన్‌ ఏనాడో చెప్పడంతో మరోసారి ఆయన మేధస్సుకు సలాం చేస్తున్నారు. విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలలో బ్లాక్‌ హోల్‌ ఒకటి. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కృష్ణ బిలాల వెనుక ఏముందనేది ఇప్పటి వరకు అంతుచిక్కలేదు. అయితే తొలిసారిగా ఈ విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

భూమికి 100 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని గుర్తించారు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. మెరుపుల్లా మొదలై ఆ తర్వాత రంగు రంగుల్లోకి మారిపోయాయి ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్‌ హోల్‌లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు.

దీంతో ఆ వెనకాల ఏముంది అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. టెలిస్కోప్‌ ద్వారానే దీన్ని గుర్తించామన్నారు.

అయితే శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని జనరల్‌ రియాల్టివిటీ పేరుతో ఐన్‌స్టీన్‌ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

అయితే అప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించడంతో ఇప్పుడు మరోసారి ఐన్‌స్టీన్‌ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రపంచ మేధావులు.

ఇవి కూడా చదవండి: Nothing Ear 1: నథింగ్ ఇయర్ 1..ట్రాన్స్‌పరెంట్ ఇయర్ ఫోన్స్..మనదేశంలో ఎప్పుడు వస్తాయి..అదరగొట్టే దీని ఫీచర్లు ఏమిటంటే..

Nokia XR20: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన పగలదు.. నోకియా మరో అద్భుతం.. ఆసక్తిరేపుతోన్న ఎక్స్‌ఆర్‌ 20 ప్రమోషన్‌ వీడియో.