ISRO: మరో వాణిజ్య రాకెట్ ప్రయోగానికి ఇస్రో రెడీ .. ఈ నెల 26న యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో

|

Mar 22, 2023 | 9:35 AM

అన్నీ అనుకూలిస్తే  ఈనెల 26 న ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 5805 కేజీలు బరువు కలిగి ఉన్న యూకే దేశానికి చెందిన 36 ఉపగ్రహాలను 450 km ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నది.

ISRO: మరో వాణిజ్య రాకెట్ ప్రయోగానికి ఇస్రో రెడీ .. ఈ నెల 26న యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో
Isro Web Satellites
Follow us on

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి రెడీ అవుతుంది. రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసి..  ఇస్రో, షార్ శాస్త్రవేత్తలు ఈ నెల 26 షార్ నుండి భారీ రాకెట్ ప్రయోగం చేయనున్నారు.  Gslv.. mark3 – lvm3.. m3 మిషన్ ద్వారా యూకే దేశానికీ చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనునుంది ఇస్రో. ఈ ప్రయోగం పూర్తి వాణిజ్య పరమైన రాకెట్ ప్రయోగం కనుక రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లయ్యింది.

షార్ లోని రెండవ వాహక ప్రయోగ వేదిక మీద నుండి ఈ lvm3..m3 రాకెట్ ప్రయోగం చేయనున్నారు శాస్త్రవేత్తలు. అన్నీ అనుకూలిస్తే  ఈనెల 26 న ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 5805 కేజీలు బరువు కలిగి ఉన్న యూకే దేశానికి చెందిన 36 ఉపగ్రహాలను 450 km ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నది. దీన్ని విజయవంతం చేసి తద్వారా ఇస్రో.. చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించడానికి రెడీ అవుతుంది.

ఇస్రో వాణిజ్య విభాగం NSIL రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి 1,000 కోట్ల రూపాయలకు పైగా ప్రయోగ రుసుముతో OneWebతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 36 Oneweb ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్‌ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..