ఈ కుర్రాడు మామూలోడు కాదు.. ఏకంగా రోబోనే తయారు చేశాడు

| Edited By:

Aug 17, 2019 | 10:52 AM

నా కొంచెం అవకాశమివ్వండి.. ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ని, చితికిన టమోటా లాంటి సూర్యున్ని చాపలో చుట్టేస్తా.. అన్నారు ఆలూరి బైరాగీ అనే కవి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. పసివాళ్ల మెదడులో ఉన్న ఆలోచనలకు అవకాశమిస్తే .. వారు ఎంతటి గొప్ప ఆవిష్కరణలు చేయగలరో చెప్పడానికే. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ హసన్ అలీ అనే 12 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. ఏకంగా పనిచేసే రోబోను తయారు చేసి అందరి […]

ఈ కుర్రాడు మామూలోడు కాదు.. ఏకంగా  రోబోనే తయారు చేశాడు
Follow us on

నా కొంచెం అవకాశమివ్వండి.. ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ని, చితికిన టమోటా లాంటి సూర్యున్ని చాపలో చుట్టేస్తా.. అన్నారు ఆలూరి బైరాగీ అనే కవి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. పసివాళ్ల మెదడులో ఉన్న ఆలోచనలకు అవకాశమిస్తే .. వారు ఎంతటి గొప్ప ఆవిష్కరణలు చేయగలరో చెప్పడానికే.

హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ హసన్ అలీ అనే 12 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. ఏకంగా పనిచేసే రోబోను తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించాడు. గృహావసరాలు, రెస్టారెంట్లలో సహాయపడే రోబోను కేవలం 15 రోజుల్లో తయారు చేశాడు. ఇది వాయిస్‌ను రికగ్నైజ్ చేసి వెంటనే ఆ కమాండ్‌కు తగిన పనిచేసి పెడుతుంది. ఇంట్లో దొరికే సామాన్లతోనే ఈ చిట్టి రోబోను తయారు చేశాడు హసన్ అలీ.

పన్నెండేళ్ళ వయసులోనే సివిల్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఉపయోగపడే ఇంటర్నెట్ థింగ్స్ (ఐ ఓ టీ), ఎంబెడెట్ సిస్టమ్స్ వంటి పాఠాలు సైతం బోధిస్తున్నాడు. ప్రస్తుతం తన వద్ద వందకు పైగా సైన్స్ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని వీటిలో ఈ రోబో సృష్టి ఒకటని చెప్పాడు హసన్ అలీ. తాను సృష్టించిన ఈ రోబో రెస్టారెంట్లు, గృహావసరాల్లో పెద్దవాళ్లకు సహకరిస్తుందని చెప్పాడు.

ఈ రోబో తయారు చేయడానికి సుమారు 15 రోజులు మాత్రమే సమయం పట్టిందని చెబుతూ.. ఈ దేశానికి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే దీన్ని తయారు చేసినని తెలిపాడు.