Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

మెగాస్టార్ అంటే ఆయనకు జెలసీనా..!

Tammareddy Bharadwaja gives clarification, మెగాస్టార్ అంటే ఆయనకు జెలసీనా..!

తమ అభిమాన హీరోను ఎవ్వరైనా ఏమంటే ఈ కాలంలో అభిమానులు అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరిస్తోన్న ఈ కాలంలో ఆ మాధ్యమం వేదికగా సదరు వ్యక్తికి చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవిని కించపరిచేలా కామెంట్లు చేశారని మెగాభిమానులు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. సైరా కలెక్షన్లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫైర్ అయ్యారు. చిరును చూసి తమ్మారెడ్డి జెలసీగా ఫీల్ అవుతున్నారని మెగాభిమానులు ఆయనను ట్రోల్ చేశారు. దీంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు మరో వీడియోను రిలీజ్ చేశారు తమ్మారెడ్డి.

‘‘వారం రోజుల క్రితం నేను సైరా సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టాను. అది నేను సైరా రిలీజ్‌కి ముందు విడుదల చేశా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. కలెక్షన్ల విషయంలో నేను ఏదో తప్పుగా మాట్లాడినట్టుగా నెగిటివ్ పోస్ట్‌లు పెట్టారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఆదివారం కంటే ముందే సైరా 300 కోట్లు వసూలు చేస్తుందని అందులో చెప్పా. ఒక్క బాహుబలి తప్ప వీకెండ్ ముందు 300 కోట్లు వసూలు చేసిన సినిమా హిందీలో కూడా లేదు. అయితే సైరా ఆ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని చెప్పా. అందులో నేను తప్పుగా మాట్లాడింది ఏంటో అర్ధం కాలేదు’’ అని అన్నారు.

Tammareddy Bharadwaja gives clarification, మెగాస్టార్ అంటే ఆయనకు జెలసీనా..!

ఇక ‘‘చిరంజీవిని చూసి నేను జెలసీ ఫీల్ అవుతున్నానని అంటున్నారు. అయినా ఒకర్ని చూసి ఎందుకు జెలసీగా ఫీల్ కావాలి? అంత అవసరం నాకేంటి? చిరంజీవిని చూస్తే నాకు జెలసీ ఎందుకు? ఆయన నటుడు, నేను దర్శకుడ్ని, నిర్మాతని. అసలు నాకు ఈ వయసులో జెలసీ ఎందుకు. నేను ఆయనలా నటుడ్ని కాలేను. ఆయన నిర్మాత కాదు, దర్శకుడు కాదు. అలాంటప్పుడు నాకు జెలసీ ఎందుకు ఉంటుంది. సైరా రికార్డ్స్ సాధిస్తుందని చెప్పిన దాన్ని కూడా ట్రోల్స్ చేస్తుంటే నేను ఏం చెప్పాలి. నేను యూట్యూబ్‌‌లో వ్యూస్ కోసం, డబ్బుల కోసం వీడియోలు పెడుతున్నారని కూడా అంటున్నారు. అదే నిజం అయితే చిరంజీవిని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. లేదా బాగా పొగిడితే వస్తాయి. నేనలా చేయలేదే.. ఆయన సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయనే అన్నా తప్ప ఇంకేం చెప్పలేదే’’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

కాగా సైరా గురించి ఆ మధ్యన ఓ వీడియోలో మాట్లాడిన తమ్మారెడ్డి.. ‘‘ఈ రోజుల్లో ఓ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందన్నది ముఖ్యం కాదు.. ఎంత వసూలు చేసిందన్నదే ముఖ్యం. యావరేజ్ టాక్‌ తెచ్చుకున్న ‘సాహో’ చిత్రమే 200 నుంచి 300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక సైరా ఏం చేస్తుందో చూడాలి’’ అని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Related Tags