గ్రేట్ లీడర్ సుష్మాస్వరాజ్.. రాజకీయ ప్రస్థానం!

సుష్మాస్వరాజ్.. పార్టీలకు అతీతంగా దేశమంతా గౌరవించదగిన గొప్ప రాజకీయ నేత. ప్రపంచం నలుమూలల ఉన్న భారత ప్రజల కష్టాలను తీర్చిన ఏకైక వీరవనిత సుష్మాస్వరాజ్. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ తన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకితమించింది. సుష్మాస్వరాజ్‌ను అందరూ ముద్దుగా ‘సూపర్ మామ్’ అఫ్ ఇండియా అని పిలుచుకుంటారు. ఈ మహానేత నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. బీజేపీ పార్టీనే కాదు దేశం కూడా ఓ గొప్ప నేతను పోగొట్టుకుందని […]

గ్రేట్ లీడర్ సుష్మాస్వరాజ్.. రాజకీయ ప్రస్థానం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 07, 2019 | 7:18 AM

సుష్మాస్వరాజ్.. పార్టీలకు అతీతంగా దేశమంతా గౌరవించదగిన గొప్ప రాజకీయ నేత. ప్రపంచం నలుమూలల ఉన్న భారత ప్రజల కష్టాలను తీర్చిన ఏకైక వీరవనిత సుష్మాస్వరాజ్. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ తన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకితమించింది. సుష్మాస్వరాజ్‌ను అందరూ ముద్దుగా ‘సూపర్ మామ్’ అఫ్ ఇండియా అని పిలుచుకుంటారు. ఈ మహానేత నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. బీజేపీ పార్టీనే కాదు దేశం కూడా ఓ గొప్ప నేతను పోగొట్టుకుందని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో సహా రాజకీయ ప్రముఖులందరూ ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇలాంటి ఓ గొప్ప రాజకీయ నాయకురాలి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

40 ఏళ్ళ సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితంలో ఎన్నో అద్భుతమైన మర్చిపోలేని ఘట్టాలు ఉన్నాయి. ఆమె 25 సంవత్సరాలు వయసులోనే హర్యానా కేబినెట్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా సుష్మాస్వారాజే కావడం విశేషం. అటు మోదీ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పని చేసిన సమయంలో ట్విట్టర్ వేదికగా ప్రపంచం నలుమూలల కష్టాలు ఎదుర్కుంటున్న భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చడంలో ఎంతో కృషి చేశారు. సహాయం చిన్నదా.. లేక పెద్దదా అనేది పట్టించుకోకుండా సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తనను సంప్రదించిన ప్రతి భారతీయుడికి సహాయపడ్డారు. ఆమె వల్ల ఇంటికి దూరంగా విదేశాలకు వెళ్లి కష్టపడుతున్న యువకులందరూ తిరిగి స్వదేశం చేరుకోగలిగారు.

మాజీ సుప్రీం కోర్ట్ లాయర్.. సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించారు. ఆమె తండ్రిగారు ఆర్ఎస్ఎస్ లీడర్ కావడం వల్ల సుష్మా పూర్తిగా రాజకీయ వాతారణంలో పెరిగారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె 1970లలోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.

1975లో స్వరాజ్ కౌశల్ అనే ప్రముఖ న్యాయవాదితో సుష్మాస్వరాజ్ పెళ్లి జరిగింది. ఇక 1990- 93 వరకు మిజోరాం రాష్ట్రానికి యువ గవర్నర్‌‌గా స్వరాజ్ కౌశల్ బాధ్యతలు చేపట్టారు.

1977లో సుష్మాస్వరాజ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 25 సంవత్సరాలకే హర్యానాకు కేబినెట్ మినిస్టర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో బీజేపీలో చేరిన ఆమె మొదట పార్టీ సెక్రటరీగా పని చేశారు. ఆమెలోని నాయకురాలి లక్షణాలు మెండుగా ఉండడంతో పార్టీ ఆమెను జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసింది.

అంతేకాకుండా 1980, 84,89ల్లో లోక్‌సభలో సుష్మాస్వరాజ్ వరుసగా ఓటములు ఎదుర్కొన్నారు. ఆ తరువాత 1990లో ఆమె తొలిసారిగా రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఆ తర్వాత ఆరేళ్లకు తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక 1996లో 13 రోజుల అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆమె సమాచార & ప్రసార శాఖ మంత్రిగా పని చేసిన తరుణంలో ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని లోక్‌సభ డిబేట్స్ అన్ని లైవ్‌లో ప్రసారం చేశారు.

1998లో మళ్ళీ లోక్‌సభకు ఎన్నికైన ఆమె దానికి రాజీనామా చేసి ఢిల్లీకి మొదట మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె రెండు నెలలు మాత్రమే అధికారం చేపట్టగలిగారు. ఇక అప్పుడే ఆమె నిర్ణయించుకుని జాతీయ స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేశారు.

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెకు బలమైన మహిళా నాయకురాలిగా బీజేపీ తరపున సుష్మాస్వరాజ్ బరిలోకి దిగారు. దేశ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయినా.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

2004 ఏప్రిల్‌లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పని చేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండు శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టారు. అటు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమైతున్న తరుణమది. ఆ సమయంలో సుష్మాస్వరాజ్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ కనక భారత ప్రధాని అయితే తాను శిరోముండనం చేసుకుంటానని, జీవితమంతా తెల్లచీరే కడతానని, పల్లీలు మాత్రమే తింటానని శపథం చేశారు. ఇక దానిలో చిన్నమ్మే గెలిచిందని చెప్పవచ్చు. ఆ సమయంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 2014లో బీజేపీ భారీ స్థాయి మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టడం.. నరేంద్ర మోదీ మొదటిసారిగా ప్రధాని మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలో సుష్మాస్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడే పార్టీలకు అతీతంగా ఆమె చేసిన మంచి పనులకు ఎంతోమందికి చేరువయ్యారు. ఒకసారి ఆమె రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఎన్నో అద్భుతమైన, విశేషమైన జ్ఞాపకాలు ఉంటాయి. అంతేకాదు మహిళా రాజకీయనేతలందరికి ఆమె ఓ స్ఫూర్తి.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో