Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘సూర్యుడివో చంద్రుడివో’.. దేవీ అదరగొట్టేశాడుగా..!

Sarileru Neekevvaru second song released, ‘సూర్యుడివో చంద్రుడివో’.. దేవీ అదరగొట్టేశాడుగా..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నుంచి రెండో పాట వచ్చేసింది. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే ఈ పాటను బి ప్రాక్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ పాటతో మెలోడీ పాటలను చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు రాక్‌స్టార్. ఇక పల్లెటూరులో ఈ పాటను తెరకెక్కించినట్లు విజువల్స్‌లో అర్థమవుతుండగా.. అందులో మహేష్‌తో పాటు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, కౌముడి, బేబి క్రితిక తదితరులు కనిపించారు.

కాగా ఈ మూవీలో నుంచి గత సోమవారం ‘మైండ్‌బ్లాక్’ అనే సాంగ్ విడుదలైంది. మాస్ బీట్‌తో ఈ పాట రాగా.. దానికి మిక్స్‌డ్ టాక్ వినిపించింది. కొందరేమో పాట అదిరిపోయిందంటూ కామెంట్లు పెట్టినా.. మరికొందరేమో దేవీ తన ట్యూన్లను రిపీట్ చేశాడంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ విమర్శలకు తాజా పాటతో చెక్ పెట్టేశాడు డీఎస్పీ. రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యానికి దేవీ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్లు, ప్రాక్ గాత్రం ‘సూర్యుడివో చంద్రుడివో’ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. అంతేకాకుండా విజువల‌్‌గానూ ఈ మూవీ మెప్పించనున్నట్లు అర్థమవుతోంది.

అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.