సుడాన్‌లో మారణహోమం.. 108 మంది కాల్చివేత

Sudan crisis, సుడాన్‌లో మారణహోమం.. 108 మంది కాల్చివేత

ప్రజాస్వామ్య ఉద్యమంపై సుడాన్ సైన్యం విరుచుకుపడింది. ఖర్తూమ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసన చేపడుతుండగా.. ఆర్మీ వారిని చుట్టుముట్టింది. ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇప్పటికి 108 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లో ఆందోళన సాగిస్తున్నారు. దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్‌ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు.

అనేక నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షలు విధించారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. ఇవి పతాక స్థాయికి చేరడంతో సైన్యం జోక్యం చేసుకొని 30 ఏళ్లుగా ఉన్న బషీర్‌ను తొలగించింది. అనంతరం తమ అధీనంలోకి తీసుకుంది. అయితే ప్రజలు మాత్రం నిరసనలు ఆపలేదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఖార్తూమ్‌లోని ప్రధాన మైదానంలో బైఠాయించారు. మంగళవారం నాడు సైనికులు 40 మందిని ఊచకోత కోసి.. మృతదేహాలను నైలు నదిలో పడేయడంతో.. ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Sudan crisis, సుడాన్‌లో మారణహోమం.. 108 మంది కాల్చివేతSudan crisis, సుడాన్‌లో మారణహోమం.. 108 మంది కాల్చివేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *