యూపీలో మరో ఘోరం.. బాలికను నడి రోడ్డుపై పడుకోబెట్టి…

Stalkers drive bike over Class 11 girl's head to kill her.. UP cops refuse to lodge FIR, యూపీలో మరో ఘోరం.. బాలికను నడి రోడ్డుపై పడుకోబెట్టి…

ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్‌ ప్రాంతంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఓ బాలికపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆగస్టు 8న సదరు బాలిక సైకిల్‌‌పై ఇంటికి తిరిగొస్తుండగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించి.. ఆమెను వేధించసాగారు. ఇది గమనించిన స్థానికులు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు అక్కడినుంచి జారుకున్నారు.

అయితే అంతా సద్దుమణిగిన అనంతరం ఆ యువకులు మళ్లీ వెనక్కి వచ్చారు. వారిలో ఇద్దరు యువకులు ఆమెను కదలకుండా రోడ్డుపై పడుకోబెట్టగా.. మూడో వ్యక్తి బాలిక తలపై నుంచి బైక్ ఎక్కించాడు. దీంతో ఆమె తలకి తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం అవుతుండడాన్ని గమనించిన కొందరు అక్కడికి చేరుకుని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఆ ముగ్గురు యవకులు అక్కడి నుంచి పారిపోయారు.

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా..కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారని బాలిక బంధువులు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంతో చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు నిరాకరించారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని బాలిక తాత వాపోయారు. అయితే పోలీసులపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆగస్టు 11న కేసు నమోదు చేశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మూడు రోజుల క్రితం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తలకు తీవ్రగాయలవడంతోనే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *