Yuvraj Singh: ఇన్‌స్టాగ్రామ్‌లో యువరాజ్‌ సింగ్ హల్‌చల్.. సరికొత్త గెటప్‌లో ఫోటో పోస్ట్.. కామెంట్స్‌తో రఫ్పాడుకున్న ప్రముఖులు..

|

Mar 26, 2021 | 1:52 AM

Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియా లెంజెండ్స్ టీమ్ సభ్యుడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో యమా యాక్టీవ్‌గా..

Yuvraj Singh: ఇన్‌స్టాగ్రామ్‌లో యువరాజ్‌ సింగ్ హల్‌చల్.. సరికొత్త గెటప్‌లో ఫోటో పోస్ట్.. కామెంట్స్‌తో రఫ్పాడుకున్న ప్రముఖులు..
Yuvraj Singh
Follow us on

Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియా లెంజెండ్స్ టీమ్ సభ్యుడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో యమా యాక్టీవ్‌గా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూవీ తాజాగా సరికొత్త లుక్‌లో అభిమానులను అలరించాడు. కొత్త గెటప్‌‌లో దిగిన ఫోటోను యూవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అభిమానులు ఆ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్‌లు కొడుతున్నారు. ఫోట్ హిట్టయ్యిందంటున్నారు. మరోవైపు.. యూవీ పోస్ట్‌పై బాలీవుడ్ నటి కిమ్ శర్మ, టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌లు, ఇర్ఫాన్ పఠాన్‌ సహా ఇతర ప్రముఖులు స్పందించారు. ‘భాయ్ పూర్తిగా బాద్‌ షా లా మారిపోయారు’ అంటూ ఇర్ఫాన్ పటాన్, శిఖర్ ధావన్ కామెంట్ చేశారు.

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్ 2021 లో ఇండియా లెజెండ్స్ టీమ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ 39 ఏళ్ల ప్లేయర్.. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన పరుగులు చేసి అందరినీ వావ్ అనిపించాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలో 194 పరుగులు చేసిన యువరాజ్ స్ట్రైక్ రేట్ 170.17గా ఉంది. అయితే, యూవీ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నమెంట్‌లో ఇవే ఎక్కువ కావడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన లీగ్ స్టేజ్ గేమ్‌లో, యూవీ బ్యాక్ టు బ్యా్క్ నాలుగు సిక్సర్లు బాది సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌లోనూ యువరాజ్ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇదిలాఉంటే.. రోడ్ సేఫ్టీ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన కొన్ని రోజుల తరువాత యువరాజ్ సింగ్ కొత్త లుక్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. యూవీ తన ఫోటోను అలా పోస్ట్ చేశాడో లేదో.. అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కొట్టారు. కేవలం గంట వ్యవధిలోనే 2.2 లక్షల లైక్స్ సంపాదించింది ఆ ఫోటో.

ఇదిలాఉండగా.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ సింగ్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు కొన్ని నెలల పాటు మైదానానికి దూరరంగా ఉన్నాడు యూవీ. ప్రస్తుతం యూవీ విదేశీ లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కాగా, గతంలో యువరాజ్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు ప్రయత్నించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరి 2021/22లో ఆస్ట్రేలియన్ లీగ్‌లో గనక పాల్గొంటే.. బీబీఎల్‌లో పాల్గొన్న మొదటి ఇండియన్ క్రికెటర్ యూవీ అవుతాడు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక భారత క్రికెటర్.. ఇతర దేశాలకు చెందిన లీగ్‌లలో ఆడకూడదు. అలా ఆడితే.. దేశంలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే లీగ్‌లకు వారికి అర్హ త ఉండదు.

Yuvraj Singh Instagram:

Also read:

Rahul Gandhi: ఆర్ఎస్‌ఎస్‌ను ఇక నుంచి ఆ పేరుతో పిలవబోను.. ‘సంఘ్ పరివార్’’పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Black Grapes: నల్ల ద్రాక్ష పండ్లను తీంటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..