
ICC T20 World Cup 2026: భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి-మార్చి 2026లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, ఇప్పటికే 15 జట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి, మార్చి 2026 మధ్య భారతదేశం, శ్రీలంకలలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లలో ఇప్పటికే 15 జట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన 5 స్థానాల కోసం త్వరలో జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో జట్లు పోటీపడతాయి.
అర్హత ఎలా సాధించాయంటే..
ఆతిథ్య దేశాలు (2): భారతదేశం 2026 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు, 2024 టీ20 ప్రపంచకప్ గెలిచినందున ఆటోమెటిక్‌గా అర్హత సాధించింది. శ్రీలంక కూడా సహ-ఆతిథ్య దేశంగా అర్హత పొందింది.
2024 సూపర్ 8 నుండి (7): గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో సూపర్ 8 దశకు చేరుకున్న జట్లు నేరుగా అర్హత పొందాయి. అవి: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్.
ఐసీసీ ర్యాంకింగ్స్ నుండి (3): జూన్ 30, 2024 నాటికి పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ తమ టీ20ఐ ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత పొందాయి.
ప్రాంతీయ క్వాలిఫైయర్ల నుండి (3): కెనడా అమెరికాస్ ప్రాంతీయ క్వాలిఫైయర్‌లో గెలిచి, నెదర్లాండ్స్, ఇటలీ యూరప్ క్వాలిఫైయర్ల ద్వారా అర్హత సాధించాయి. ఇటలీకి ప్రపంచకప్‌కు అర్హత లభించడం వారి క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
మిగిలిన 5 స్థానాలు: ఇంకా ఐదు జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. ఇవి త్వరలో జరగనున్న ప్రాంతీయ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరో ఉత్కంఠభరితమైన టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 1న ప్రారంభమై మార్చి 1, 2026 వరకు జరుగుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..