మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికి, ఫైనల్లో అమ్మాయిలు చేతులెత్తేయడం యావత్ భారతదేశానికి నిరాశపరిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి.. ఓపెనర్లు అలిస్సా హీలీ (75), బెత్ మూనీ (78 నాటౌట్) అర్ధ సెంచరీలు చేసి..వారి జట్టు 184 పరుగుల భారీ స్కోర్ చేయడంలో సహాయపడ్డారు. మరోవైపు ఆసిస్ బౌలర్లు మేగాన్ షుట్ (4/18), జెస్ జోనాసెన్ (3 / 20) సైతం అదిరిపోయే ప్రదర్శన చేశారు. దీంతో ఐదోసారి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
స్టార్ ఇండియా ఆటగాళ్ళు షఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా వెంటవెంటనే ఔటవ్వడంతో టీమ్ డిఫెన్స్‌లో పడింది. ఒత్తిడిని తట్టుకోలేక భారత్ 19.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. టోర్నమెంట్ అంతటా విపరీతమైన ఫామ్‌లో ఉన్న 16 ఏళ్ల షఫాలి… కేవలం 2 పరుగులతో ఇన్సింగ్స్ మూడో బంతికే వెనుదిరిగింది. ఓటమి అనంతరం షఫాలి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేడియంలోనే ఏడుస్తూ కనిపించింది. సహచర క్రీడాకారిణి ఆమెను ఓదార్చింది. తుది పోరులో భారత్ ఓడినప్పటికి, మన అమ్మాయిల పోరాట పటిమను చూసి దేశం మొత్తం ప్రశంసిస్తోంది. తప్పులను వెతుక్కుని మన్ముందు మంచి ప్రదర్శన చెయ్యాలని మరికొందరు క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.
It’s ok Shafali verma, you’ve achieved more than what a 16 year old can do ?? don’t be sad ?? We are proud you #shafaliverma #T20WorldCup #INDvAUS #TeamIndia pic.twitter.com/c4Pdxi2ryE
— AVI♥️NASH (@avi__n__ash) March 8, 2020