T20 WORLD CUP: అలాంటి మ్యాచ్ ను ప్రపంచంలో ఎవరూ చూసుండరు.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 24, 2022 | 8:53 PM

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. నిజంగా అలాంటి మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పుడూ చూసుండకపోవచ్చు. ఎన్నో మ్యాచ్ లు ఇప్పటివరకు ఉత్కంఠ..

T20 WORLD CUP: అలాంటి మ్యాచ్ ను ప్రపంచంలో ఎవరూ చూసుండరు.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat Kohli
Follow us on

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. నిజంగా అలాంటి మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పుడూ చూసుండకపోవచ్చు. ఎన్నో మ్యాచ్ లు ఇప్పటివరకు ఉత్కంఠ భరితంగా జరిగినా.. ఆదివారం నాటి మ్యాచ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ పై చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లతో పాటు, ప్రస్తుత స్టార్ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్టేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఛేజింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లి 82 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో చివరి బంతికి భారత్ విజయం సాధించి సంబురాలు చేసకుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్పందించారు. ఆ మ్యాచ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆదివారం భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూసిన తర్వాత ప్రపంచంలో అంతకు మించిన మ్యాచ్ మరొకటి లేదన్నారు.

టీ20 ప్రపంచకప్ లో మ్యాచ్ లు అన్ని అంతే అద్భుతంగా ఉంటే తాము మూడు వారాల పాటు అక్కడే ఉంటామని అన్నాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ చూడటానికి అద్భుతమైన ఆట అని చెప్పాడు మార్ష్. ఆ మ్యాచ్ చూసిన తర్వాత తాను కూడా గ్రౌండ్ లో ప్రేక్షకుల మధ్య ఉండి, వారిలో భాగమైతే బావుండు అని అనిపిస్తుందని మిచెల్ మార్ష్ మీడియాతో మాట్లాడుతూ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పై తన అభిప్రయాలను పంచుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. T20 మ్యాచ్‌లో నిస్సందేహంగా విరాట్ కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శనను అందించాడని మార్ష్ ప్రశంసించాడు.

దాదాపు అసాధ్యమైన పరిస్థితుల నుండి 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కోహ్లీ భాగస్వామ్యాన్ని మర్చిపోలేమన్నారు. అద్భుతంగా ఆడాడని, కోహ్లీ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు విరాట్ కోహ్లి 12 నెలలు ఫిట్ నెస్ తో లేడని, ఆ తర్వాత మంచి ఫిట్ నెస్ తో టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమై.. మొదటి మ్యాచ్ లో తన మార్క్ ను చూపించాడన్నారు. కోహ్లీ ఆడిన తీరు చూడటానికి అద్భుతమైన ఇన్నింగ్స్.. నమ్మశక్యం కాని ఆట అంటూ మార్ష్ చెప్పారు. కాగా.. సూపర్ 12లో తమ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..