PAK vs NZ: ఆ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ విరిగిపోయింది.. న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్ లో ఫన్నీ ఇన్సిడెంట్..

|

Oct 14, 2022 | 1:38 PM

న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరగుతున్న టీ20 ట్రై సిరీస్ లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సేమ్ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి..

PAK vs NZ: ఆ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ విరిగిపోయింది.. న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్ లో ఫన్నీ ఇన్సిడెంట్..
Haris Rauf Pacy Delivery Breaks New Zealand Batsman Glenn Phillips Bat
Follow us on

క్రికెట్ లో ముఖ్యంగా బ్యాట్స్ మెన్ సమర్థంగా ఎదుర్కొవల్సింది ఫాస్ట్ బౌలర్లనే, పేసర్ బాల్ వేస్తే తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా ఒకోసారి వేగంగా వచ్చే బంతి తగిలి బ్యాట్స్ మెన్ కు గాయాలు అయిన ఘటనలు చూశాం. తగలరాని ప్రదేశంలో తగిలితే ఎంతో ప్రమాదం కూడా. అందుకే ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొనే బ్యాట్స్ మెన్ తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. స్పిన్ బాల్ అయితే అంత వేగంగా రాదు కాబట్టి పెద్ద సమస్య ఉండదు. ఒక్కోసారి బాల్ వేగానికి బ్యాట్ విరిగిన సందర్భాలు చూశాం. తాజాగా న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరగుతున్న టీ20 ట్రై సిరీస్ లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సేమ్ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. బౌలర్ వేసిన బంతికి ఏకంగా బ్యాట్ విరిగిపోయింది. ముక్కోణపు సిరీస్ ఫైనల్‌ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ మొహమ్మద్ నవాజ్ 22 బంతుల్లో 38 పరుగులు చేసి పాకిస్తాన్ 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఒకానొక దశలో పాకిస్తాన్ గెలవదనుకున్న సమయంలో నవాజ్ భీకర బ్యాటింగ్ తో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో చేధించి ట్రై సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ విజయం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్‌కు ముందు పాకిస్తాన్ కు ఎంతోకొంత బలాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. ఇదే మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు సగటున ఓవర్ కు ఏడుకు పైగా పరుగులు ఇవ్వగా ఫాస్ట్ బౌలర్ హ్యారీస్ రవూఫ్ మాత్రం ఎకనామిక్ స్పెల్ బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి163 పరుగులకే పరిమితం చేశాడు.

ఇవి కూడా చదవండి

నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రవూఫ్ 2 వికెట్లు తీసి 5.5 రన్ రేటుతో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే రవూఫ్ బౌలింగ్‌లో మ్యాచ్ ఆరో ఓవర్ నాలుగో బంతికి గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ విరిగింది. 143 కిలోమీటర్ల వేగంతో వేసిన బాల్ కారణంగా ఫిలిప్స్ బ్యాట్‌లోని ప్రధాన భాగం ఎగిరి కింద పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..