కోహ్లీ టాప్.. వరుసగా మూడోసారి.. ఎవరి బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..?
విరాట్ కోహ్లీ వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ వరుసగా మూడో సంవత్సరం ఇండియాలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. రోజురోజుకు విరాట్ కోహ్లీ ఆటతో పాటే బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతోంది. ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే కంపెనీ జరిపిన సర్వేలో రూ.1690 కోట్ల బ్రాండ్ వాల్యూతో విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. 2018 నుంచీ 2019కి […]
విరాట్ కోహ్లీ వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ వరుసగా మూడో సంవత్సరం ఇండియాలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. రోజురోజుకు విరాట్ కోహ్లీ ఆటతో పాటే బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతోంది. ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే కంపెనీ జరిపిన సర్వేలో రూ.1690 కోట్ల బ్రాండ్ వాల్యూతో విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. 2018 నుంచీ 2019కి కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది. ఈ మధ్య వరుస సినిమాలతో కుమ్మేస్తున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్… రూ.743 కోట్లతో బ్రాండ్ వాల్యూలో రెండో పొజిషన్‌లో ఉన్నాడు. దీపికా పదుకొణె ఈసారి రూ.665 కోట్లతో నంబర్ 3కి జారిపోయింది.
ఈ లిస్టులో రూ.293 కోట్లతో ధోనీ… 9వ స్థానంలో ఉన్నాడు. 2018లో 12వ స్థానంలో ఉన్న ధోనీ మూడు స్థానాలు ఎగబాకాడు. రిటైరైనప్పటికీ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వాల్యూ కొనసాగిస్తూ రూ.153 కోట్లతో 15వ పొజిషన్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ రూ.163 కోట్లు బ్రాండ్ వాల్యూ తో 20వ స్థానంలో ఉన్నాడు. అత్యధిక బ్రాండ్ విలువ గల ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో టాప్-20లో క్రికెటర్లు నలుగురు ఉన్నారు. టాప్ 20 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ వాల్యూ అక్షరాలా రూ.7833 కోట్లు.