బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు!
India Vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. నాలుగేళ్ళ నుంచి టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి. దీనికి ఉదాహరణే కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్.. అందులో బౌలర్లు తమ అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శనను కనబరిచారు. అయితే మొదటి వన్డేలో మాత్రం […]
India Vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. నాలుగేళ్ళ నుంచి టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి. దీనికి ఉదాహరణే కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్.. అందులో బౌలర్లు తమ అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శనను కనబరిచారు. అయితే మొదటి వన్డేలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చెత్త ఫీల్డింగ్, పేలవమైన బౌలింగ్‌తో కోహ్లీసేన పరాజయం పాలైంది.
ఇదిలా ఉంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరుపొందిన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి వన్డేలో అతడు పరుగులు పెద్దగా ఇవ్వకపోయినా.. ఏకంగా 13 వైడ్లు విసిరాడు. అతడి కెరీర్‌లోనే ఇన్ని వైడ్లు వేయడం ఇదే తొలిసారి. ఇక మరో పేసర్ షమీ 7 వైడ్లు వేయగా.. కుల్దీప్, జడేజాలు చెరో వైడ్ వేశారు. దీనితో భారత్ బౌలర్లు మొత్తం 24 వైడ్లను వేశారు. ఇక గతంలో భారత్ ఎక్కువ వైడ్లు వేసిన మ్యాచ్‌లు ఏవంటే…
2007లో వెస్టిండీస్ మ్యాచ్‌లో – 25
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో – 26
2004లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో – 28
1999లో కెన్యాతో మ్యాచ్‌లో 31 వైడ్లు వేసింది.