Covid-19 vaccine: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ టీకా వేసుకుంటున్న ఫొటోను సోమవారం ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఆయన కామెంట్ పెట్టాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు కోహ్లీ. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు.
కాగా.. డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇక కరోనాపై తాను, అనుష్క శర్మ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. కరోనా కాలంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తామన్నామని.. తమ వంతుగా కెట్టో వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ చేయనున్నట్లు చెప్పాడు. అందుకోసం ఓ క్యాంపెయిన్ సైతం మొదలు పెట్టాడు.
India skipper Virat Kohli receives first dose of COVID-19 vaccine
Read @ANI Story | https://t.co/AvgOl0Y2f6 pic.twitter.com/012lHLGQ4e
— ANI Digital (@ani_digital) May 10, 2021
దంపతులు అనుష్క, కోహ్లీ దాదాపు 7కోట్ల వరకు కోవిడ్ రిలీఫ్ ఫండ్ రైజింగ్ చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కరోనా బాధితుల సహాయార్ధం 2కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని వెల్లడించారు. ఇక త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెటర్లు కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది.
Also Read: