Cricket: విరాట్ కోహ్లీ పేరు చెబితే భారత క్రికెట్ అభిమానుల్లో ఓ నూతనోత్సహం.. బౌలర్లపై విరుచుకుపడి.. కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ తన పేలవమైన ఫామ్ తో కొంతకాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోహ్లీని కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత.. అతడి ప్రదర్శన అంతగా ఆకట్టుకోకపోవడంతో క్రికెట్ అభిమానులు కోహ్లీ ఆటతీరుపట్ల నిరుత్సాహంగా ఉన్నారు. ఆసియా కప్ భారత స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చి.. తన బ్యాట్ తో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే టైంలో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ తొలి మ్యాచ్ లో కోహ్లీ ఆఫ్ సెంచరీ చేస్తే విమర్శకుల నోళ్లు మూతపడతాయని వ్యాఖ్యానించారు రవిశాస్త్రి.
విరాట్ కోహ్లీ తిరిగి పామ్ లోని రావాలని అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత కోహ్లీని చూడలని ఆశతో ఉన్నారు. కొంతకాలంగా పేలవమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న కోహ్లీ అభిమానులు ప్రశంసలు పొందాలంటే ఆసియా కప్ మొదటి మ్యాచ్ లో 50 పరుగులు చేస్తే చాలని రవిశాస్త్రి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో తాను విరాట్ కోహ్లీతో మాట్లాడింది లేదని.. అయితే స్టార్ బ్యాటర్లు సరైన టైంలో బాగా ఆడతారన్నారు. ఆసియా కప్ కోసం ప్రాకీస్ చేయడానికి కోహ్లీకి మంచి సమయం దొరికిందని.. తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు. విరాట్ కోహ్లీ తిరిగి గాడిలో పడటానికి పాకిస్తాన్ తో జరిగే ఫస్ట్ మ్యాచ్ సరిపోతుందన్నారు. కోహ్లీలో పరుగుల దాహం తీరలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఫామ్ లోకి వస్తే గత చరిత్రను అభిమానులు మర్చిపోతారని.. ఎక్కువ రోజులు గుర్తించుకోరని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ కంటే ఫిట్ గా ఉండే భారత క్రికెటర్ లేడని రవిశాస్త్రి పేర్కొన్నారు. అతడొక రన్నింగ్ మెషిన్ అని.. తిరిగి పూర్వపు ఫామ్ పొందటానికి ఒక ఇన్నింగ్స్ సరిపోతుందన్నాడు. కోహ్లీ తప్పకుండా తిరిగి ఫామ్ లోకి వస్తాడని, కేరీర్ లో అత్యుత్తమ ఫామ్ పొందుతాడని రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..