Neeraj Chopra: లడ్డూలు పంచుతూ..డ్యాన్స్‌లు చేస్తూ.. బల్లెం వీరుడి స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు

|

Jul 24, 2022 | 10:03 PM

World Athletics Championship 2022: అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌చోప్రా (Neeraj Chopra) రజత పతకం సాధించాడు. తద్వారా అంజు బాబీ జార్జ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారుడిగా అరుదైన రికార్డును..

Neeraj Chopra: లడ్డూలు పంచుతూ..డ్యాన్స్‌లు చేస్తూ.. బల్లెం వీరుడి స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు
Neeraj Chopra
Follow us on

World Athletics Championship 2022: అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌చోప్రా (Neeraj Chopra) రజత పతకం సాధించాడు. తద్వారా అంజు బాబీ జార్జ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారుడిగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ఉదయం జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో నీరజ్‌ 88.13 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. ఈక్రమంలో పోటీల్లో రెండోస్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్ సొంతం చేసుకున్నాడు. కాగా నీరజ్‌ విజయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ (PM NarendraModi) , హరియానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అంజు బాబీ జార్జ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఒలింపిక్స్ పతక విజేత అభినవ్ బింద్రా తదితర ప్రముఖులు బల్లెంవీరుడిపై ప్రశంసలు కురిపించారు.

గర్వంగా ఉంది..

ఇవి కూడా చదవండి

ఇక నీరజ్ విజయంతో హరియానా రాష్ట్రంలోని అతని స్వగ్రామం పానిపట్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా నీరజ్‌ కుటుంబ సభ్యులు ఇంటికొచ్చిన అతిథులందరికీ లడ్డూలు పంచిపెట్టారు. ఇక ఆ గ్రామ మహిళలు చోప్రా ఇంటి ఆవరణలో సంతోషంతో డ్యాన్సలు చేశారు. ‘మాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. మా అబ్బాయి విజయాన్ని దేశమంతా సంబరంలా జరుపుకుంటోంది’ అంటూ నీరజ్‌ తల్లిదండ్రులు సరోజ, సతీశ్‌ చోప్రా అని పేర్కొన్నారు. ఈక్రమంలో నీర‌జ్ చోప్రా కుటుంబ స‌భ్యుల సంబరాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..