Costly Shoes: ఈ షూ విలువ 11 కోట్లు, బంగారం, వజ్రాలతో తయారు చేయలేదు.. మరి దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా

|

Jun 23, 2023 | 2:35 PM

ఒక్క జత షూ ధర నిజంగా కోట్లలో ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. అంత కాస్టిలీ షూస్ ని కూడా కొనుగోలు చేశారు. కోట్ల రూపాయలు ఖరీదు ఉన్నాయి కదా మరి ఈ షూస్ ని బంగారంతో  చేసి వజ్రాలు పొదగలేదు. అయినా ఖరీదైన షూ ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం..

Costly Shoes: ఈ షూ విలువ 11 కోట్లు, బంగారం, వజ్రాలతో తయారు చేయలేదు.. మరి దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా
Costly Shoues
Follow us on

పాదాలకు రక్షణ ఇచ్చే బూట్లను ధరించడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడతారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, క్రీడాకారులు ఇలా అందరూ ఉపయోగించే విధంగా రకరకాల ధరల్లో బూట్లు అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే కోట్ల ఖరీదు చేసే బూట్లు ఉన్నాయన్న సంగతి తెలుసా.. ! ఒక్క జత షూ ధర నిజంగా కోట్లలో ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. అంత కాస్టిలీ షూస్ ని కూడా కొనుగోలు చేశారు. కోట్ల రూపాయలు ఖరీదు ఉన్నాయి కదా మరి ఈ షూస్ ని బంగారంతో  చేసి వజ్రాలు పొదగలేదు. అయినా ఖరీదైన షూ ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం..

కోట్లలో ఖరీదైన బూట్లను రూ.11 కోట్లకు కొనుగోలు చేశారు. నిజానికి ఈ ఫ్లూ గేమ్ స్నీకర్లను బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ధరించారు. ఇటీవల ఈ షూ వేలం వేశారు. గోల్డెన్ వేలంలో ఈ షూ 1.38 బిలియన్ డాలర్లకు (అంటే రూ. 11 కోట్లకు పైగా) అమ్ముడైంది. నివేదిక ప్రకారం ఈ వేలం 1997 NBA ఫైనల్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు నిర్వహించారు. చికాగో బుల్స్ , ఉటా జాజ్ మధ్య జరిగిన మ్యాచ్ మైఖేల్ జోర్డాన్ కెరీర్ ని అద్భుతంగా భావిస్తారు. అంతేకాదు అతని కెరీర్‌లో అత్యుత్తమ ఆటలలో ఒకటిగా పిలువబడుతుంది.

ఇవి కూడా చదవండి

మైఖేల్ బాల్ బాయ్‌కి బహుమతిగా ఇచ్చాడు
ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత, మైఖేల్ తన స్నీకర్లపై సంతకం చేసి వాటిని బాల్ బాయ్ ట్రూమాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. నిజానికి ట్రూమాన్ గేమ్ ప్రారంభమయ్యే ముందు మైఖేల్ కోసం యాపిల్ సాస్ తెచ్చేవాడు. తన ప్రవర్తనతో మైఖేల్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతను తన విలువైన షూ ని మైఖేల్ జోర్డాన్  బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ షూ వేలంలో ఏకంగా కోట్లకు అమ్ముడైంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..