AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat: స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం.. వినేశ్ ఫోగట్‌ భావోద్వేగం

పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్‌ ఫొగట్‌ తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. ఆమె స్వాగతం పలికేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా తన కోసం వచ్చిన ప్రజల్ని చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Vinesh Phogat: స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం.. వినేశ్ ఫోగట్‌ భావోద్వేగం
Vinesh Phogat Crying
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2024 | 11:53 AM

Share

స్వల్ప బరువు కారణంగా ఒలింపిక్స్‌ నుంచి బహిష్కరణకు గురైన రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ స్వదేశానికి తిరిగివచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉదయమే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అభిమానుల స్వాగతం చూసి వినేష్‌ ఫోగట్‌ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిపర్యంతమైన ఆమెను కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా, సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా ఓదార్చారు. భారీ ర్యాలీ ఆమె ఎయిర్‌పోర్టు నుంచి హర్యానాకు బయలుదేరారు.

పారిస్‌ ఒలంపిక్స్‌లో రజత పతకం కోసం రెజ్లర్‌ వినేశ్ ఫోగట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఒలంపిక్స్‌లో తనపై వేసిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్ చేసిన అప్పీల్‌ను కాస్‌ కొట్టివేసింది. ఫైనల్‌కు చేరిన తర్వాత అనర్హత వేటు వేయడంతో తనకు రజతం ఇవ్వాలని కోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టినఅడ్‌హక్‌ డివిజన్‌ తీర్పు వెల్లడించింది. ఫోగట్‌ చేసిన అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించిందని ఇండియన్‌ ఒలంపిక్‌ సంఘం ప్రకటించింది. యునైటెడ వరల్డ్‌ రెజ్లింగ్‌, అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ విధించిన అనర్హతపై వినేష్‌ అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించడం దిగ్బ్రాంతికి, నిరాశకు గురిచేసిందన్నారు ఇండియన్‌ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష. 100 గ్రాముల బరువు విషయంలో తలెత్తిన వివాదంపై తీర్పునకు సంబంధించిన పరిణామాలు వినేష్‌ కెరీర్‌ పరంగానే కాకుండా క్రీడా స్ఫూర్తికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాస్ తీర్పుపై ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ షాకయింది. ఫోగట్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఒలంపిక్స్‌లో అనర్హతపై ఇంకా ఎలా ముందుకెళ్లాలనుకున్నా వినేష్‌కు సాయం అందిస్తామని స్పష్టం చేసింది.

ఇక.. పారిస్‌ ఒలంపిక్స్‌ రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ 50కేజీల విభాగంలో 100గ్రాములు అదనంగా బరువు ఉందంటూ వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేయడంతోపాటు.. 50కిలోల విభాగంలో ఫైనల్‌లో ఓడిన క్యూబాకు చెందిన లోపెజ్‌తో కలిసి తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ ఫోగట్‌ అప్పీల్‌ చేశారు. దీనికి సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ తీర్పు వెల్లడిస్తూ.. వినేష్‌ అప్పీల్‌ను తిరస్కరించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
Team India: ధోని వారసుడు దొరికేశాడోచ్.. ఎంట్రీ ఎప్పుడంటే?
Team India: ధోని వారసుడు దొరికేశాడోచ్.. ఎంట్రీ ఎప్పుడంటే?