క్రికెట్‌లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడమంటే మామూలు విషయం కాదు. బ్యాటర్లకు ఎంతో నైపుణ్యం, అనుభవముంటే గానీ ఈ ప్రమాదకరమైన బంతులను ధైర్యంగా ఎదుర్కోలేరు. గతంలో షార్ట్ పిచ్ బాల్స్ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మైదానంలోనే కుప్పుకూలిపోయాడు. ఆతర్వాత ఎంతోమంది క్రికెటర్లు ఇలా గాయపడడంతో షార్ట్ పిచ్ బాల్స్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఓ బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బంతి బ్యాటర్ హెల్మెట్‌కు బలంగా తాకడంతో అది కాస్తా ఎగిరి కిందపడింది. అదృష్టవశాత్తూ బ్యాటర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లో కెళితే.. ఆస్ట్రేలియా దేశవాళి క్రికెట్ మార్ష్ కప్‌లో భాగంగా సోమవారం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో క్వీన్స్‌లాండ్ బుల్స్, వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. క్వీన్స్‌లాండ్స్ 28వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాటర్, వికెట్ కీపర్ జిమ్మీ పీర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా వెస్టర్న్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కామెరూన్ గ్రీన్ బంతి అందుకున్నాడు. ఎంతో వేగంతో అతడు విసిరిన షార్ట్ పిచ్ బంతి నేరుగా బ్యాటర్ హెల్మెట్‌ను తాకింది. దీంతో అది కాస్తా ఎగిరి నేలపై పడిపోయింది. వెంటనే తోటి క్రికెటర్లంతా పీర్సన్ దగ్గరకు వెళ్లి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జట్టు ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి బ్యాటర్‌ను పరీక్షించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సమయంలో పీర్సన్ 12 పరుగుల వద్ద ఉండగా, బాల్ బలంగా తాకిన తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. 50 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ జట్టు 60 పరుగుల తేడాలో ఓటమిపాలైంది.
Ouch! Vicious short ball from Cameron Green. Thankfully Jimmy Peirson was OK and went on to make 62 off 50 balls #MarshCup pic.twitter.com/yEJKoTAPtw
— cricket.com.au (@cricketcomau) November 15, 2021
Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..
Hardik Pandya: ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు.. ఎందుకంటే..