Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు.. మనీష్‌ నర్వాల్‌కు గోల్డ్‌, సింగ్‌ రాజ్‌కు సిల్వర్‌.

|

Sep 04, 2021 | 12:56 PM

Paralympics: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాలు జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 14 పతకాలు భారత్‌ ఖాతాలో చేరగా తాజాగా మరో రెండు పతకాలు...

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు.. మనీష్‌ నర్వాల్‌కు గోల్డ్‌, సింగ్‌ రాజ్‌కు సిల్వర్‌.
Medals
Follow us on

Paralympics: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాలు జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 14 పతకాలు భారత్‌ ఖాతాలో చేరగా తాజాగా మరో రెండు పతకాలు భారత ప్లేయర్స్‌ వశమయ్యాయి. శనివారం జరిగిన షూటింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్‌ 50 మీటర్స్‌ పిస్టల్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్‌ మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో గోల్డ్‌ మెడల్స్‌ సంఖ్య మూడుకి చేరింది. ఇక భారత్‌కు చెందిన మరో ప్లేయర్‌ సింగ్‌ రాజ్‌ సిల్వర్‌ పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇదిలా ఉంటే శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3 సెమీ ఫైనల్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ 21-11, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను ఓడించి ఫైనల్లోకి చేరాడు. ఈ లెక్కన ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య 16కి చేరిందన్నమాట.

శుభాకాంక్షలు తెలిపి మోడీ..

పారాలింపిక్స్‌లో భారత్‌కు ఖాతాలో మరో రెండు పతకాలను చేర్చిన మనీష్‌, సింగ్‌ రాజ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాకు పతకాలను తెచ్చి పెట్టిన ఇద్దరు ప్లేయర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను కొనసాగించాలంటూ మోడీ ట్వీట్ చేశారు.

Also Read: Dry Amla Benefits: ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..

Wireless Charging: మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఇతర పరికరాలు గాలి ద్వారానే చార్జింగ్‌.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ

Drunken Drive: మద్యం తాగి బండి నడుపుతున్నారా.? అయితే జాగ్రత్త.. భవిష్యత్తులో మళ్లీ వాహనం నడపలేరు.