Vandana Katariya: టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ లో భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో .. హాకీ ప్లేయర్ వందన కటారియా వల్లనే ఓడిపోయింది అంటూ కొందరు ఆమె ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సెమీఫైనల్ లో ఓటమికి కారణమంటూ.. కులం పేరుతో కొంతమంది దూషించినట్లు వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వందన కుటుంబాన్ని వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు జాతీయ స్థాయిలో హాకీ క్రీడాకారుడని తెలుస్తోంది. దీంతో అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రోష్‌నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందన కటారియా కారణంగానే భారత్ సెమీస్ లో ఓటమిపాలైందని .. ఆమె ఇంటి ముందు కొంతమంది కులం పేరుతో దూషిస్తూ.. నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కటారియా కుటుంబం నివసిస్తున్న ఇంటి ముందు నిందితులిద్దరూ క్రాకర్స్ పేల్చి, నృత్యం చేస్తూ వేడుక చేసుకున్నారని వందన అన్న శేఖర్ చెప్పారు. అంతేకాదు తమని కులం పేరుతో దుర్భాషలాడారని.. తమపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మహిళల హాకీ జట్టులో “చాలా మంది దళిత క్రీడాకారులు” ఉన్నందున ఓడిపోయిందని ఇద్దరు నిందితులు వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో శేఖర్ తెలిపారు.
Also Read: కాంస్యం పోరులో భారత్ ఓటమి.. తృటిలో చరిత్ర సృష్టించే అవకాశం కోల్పోయిన అమ్మాయిలు