Tokyo Olympics 2021: రజత పతకం బంగారమయ్యేనా? మీరాబాయి చానుకి స్వర్ణం అందే ఛాన్స్.. ఎందుకో తెలుసా..!

|

Jul 26, 2021 | 2:50 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం వచ్చే అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చైనా క్రీడాకారిణి జీహుహో తొలిస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది.

Tokyo Olympics 2021: రజత పతకం బంగారమయ్యేనా? మీరాబాయి చానుకి స్వర్ణం అందే ఛాన్స్.. ఎందుకో తెలుసా..!
Meerabhai Chanu
Follow us on

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం వచ్చే అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చైనా క్రీడాకారిణి జీహుహో తొలిస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. కాగా, చైనా క్రీడాకారిణి జీహుహోను డోపింగ్ టెస్టు కోసం పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి. అందుకే జీహుహోను టోక్యోలోనే ఉండాలని నిర్వాహకులు ఆదేశించారు. ఈ డోపింగ్ టెస్టులో చైనా అథ్లెట్ జీహుహో దోషిగా తేలితే.. ఆమె గెలుచుకున్న బంగారు పతకం మీరాబాయి చాను సొంతం కానుంది.

చైనాకు చెందిన జీహుహో శనివారం మొత్తం 210 కిలోలను ఎత్తి స్వర్ణం సాధించి సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. ఒక అథ్లెట్ డోపింగ్ పరీక్షలో విఫలమైతే, వెండి గెలిచిన అథ్లెట్‌కు బంగారం లభిస్తుందని ఒలింపిక్ నియమాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన భారత్ ఖాతాలో స్వర్ణ పతకం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పోటీల్లో భారత్ వెయిట్ లిఫ్టర్ చాను మొత్తం 202 కిలోల బరువును ఎత్తి, రెండవ స్థానంలో నిలిచింది. అలాగే ఇండోనేషియా విండి కాంటికా ఐసా 194 కిలోల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.

మరోవైపు, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 69 కిలోల విభాగంలో కరణం మల్లీశ్వరీ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె తరువాత మీరాబాయి చాను ఒలింపిక్ పతకం సాధించి రికార్డ్ నెలకొల్పింది.

Also Read: Tokyo Olympics 2020 Live: మీరాబాయి చానుని ప్రశంసించిన రాజ్యసభ సభ్యులు.. స్వదేశం చేరుకున్న రజత పతక విజేత

టీమిండియా నడ్డి విరిచిన దిగ్గజ ఆటగాడు.. లార్డ్స్‌లో ఘోర పరాజయం.. ఆ ఆటగాడు ఎవరంటే..!

Tokyo Olympics 2020: బికినీలతోనే జిమ్నాస్టిక్స్‌ చేయాలా..? ఈ అథ్లెట్ చేసిన పనికి సలాం అంటోన్న జనం