Tokyo Olympics Highlights: మహిళల హాకీ సెమీఫైనల్‌ లో 1-2 తేడాతో భారత్ ఓటమి..

| Edited By: Ram Naramaneni

Aug 04, 2021 | 9:44 PM

టోక్యో ఒలింపిక్ క్రీడలలో ఆగస్టు 4 భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఈ రోజు భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకునే అవకాశం కోసం పోటీపడనుంది...

Tokyo Olympics Highlights: మహిళల హాకీ సెమీఫైనల్‌ లో 1-2 తేడాతో భారత్ ఓటమి..
Ravi Dahiya

భారతదేశం, అర్జెంటీనా మధ్య జరుగుతున్న మహిళల హాకీ రెండో సెమీ-ఫైనల్‌లో 1-2 తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో తొలిసారిగా ఫైనల్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. తొలి క్వార్టర్‌ ఆదిలోనే గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా త‌ర‌ఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు. ఈ ఓటమితో భారత మహిళల జట్టు కాంస్య పతకం కోసం ఆగస్టు 6న బ్రిట‌న్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

అటు భారత రెజ్లర్లు రవి దహియా, దీపక్ పునియా దుమ్ములేపారు. 57 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో బల్గేరియా ఆటగాడు జియోర్గి వంగెలోవ్‌ను 4-14 తేడాతో ఓడించి భారత స్టార్ రెజ్లర్ రవి దహియా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. అదే విధంగా 86 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో చైనా ఆటగాడు జుషేన్ లిన్‌పై 3-6తో దీపక్ పునియా విజయం సాధించి సెమీఫైనల్ కు క్వాలిఫై అయ్యాడు.

అటు జావెలిన్ త్రోలో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టేశాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో నెగ్గి ఫైనల్ కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఈ ఫీట్ సాధించిన తోలి ఇండియన్ గా ఘనత సాధించాడు. నేటి మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ దూరం(86.65 మీటర్ల) నీరజ్ జావెలిన్ విసరడం విశేషం. 23 ఏళ్ల ఈ ప్లేయర్ తొలిసారి ఒలింపిక్స్ లో ఆడుతున్నాడు. ఇక ఆగష్టు 7న జరగబోయే ఫైనల్స్ టాప్ 3 లో నిలిస్తే ఏదొక పతకం రావడం ఖాయం. ఇక మరో అథ్లెట్ శివపాల్ సింగ్ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయాడు. మూడు త్రోస్‌ను 76.40 మీటర్లు, 74.80 మీటర్లు, 74.81 మీటర్లుగా నమోదు చేశాడు. గోల్ఫ్‌లో అయితే అదితి అశోక్, దీక్షా దగర్ మహిళల రౌండ్ 1 స్ట్రోక్ ప్లేను మొదలు పెట్టారు. కాగా, ఈ రోజు భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకునే అవకాశం కోసం పోటీపడనుంది. అర్జెంటీనాతో సెమీ ఫైనల్లో తలపడనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Aug 2021 05:41 PM (IST)

    కాంస్య పతకం మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

    భారతదేశం, గ్రేట్ బ్రిటన్ మధ్య మహిళల హాకీ కాంస్య పతక మ్యాచ్ ఆగస్టు 6 న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు కాంస్య పతకం లభిస్తుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ ఆడి చరిత్ర సృష్టించిన రాణి రాంపాల్ జట్టు నుంచి మరింత అద్భుతమైన మ్యాచ్‌ చూడవచ్చు. అదే సమయంలో పురుషుల కాంస్య పతక మ్యాచ్ ఆగస్టు 5 న జరుగుతుంది. ఇందులో భారతదేశం జర్మనీతో తలపడుతుంది.

  • 04 Aug 2021 05:15 PM (IST)

    మహిళల హాకీ సెమీఫైనల్‌ లో 1-2 తేడాతో భారత్ ఓటమి..

    భారతదేశం, అర్జెంటీనా మధ్య జరుగుతున్న మహిళల హాకీ రెండో సెమీ-ఫైనల్‌లో 1-2 తేడాతో ఓడిపోయింది. దీంతో తొలిసారిగా ఫైనల్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. కానీ కాంస్య పతకం సాధించాలనే వారి ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇందుకోసం భారత్ గ్రేట్ బ్రిటన్ తో తలపడుతుంది. బ్రిటన్ జట్టు మొదటి సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో ఓడిపోయింది. నెదర్లాండ్స్ అతనిని 5-1తో ఓడించింది. నెదర్లాండ్స్, అర్జెంటీనా ఇప్పుడు బంగారు, రజత పతకాల కోసం ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడుతాయి.

  • 04 Aug 2021 05:05 PM (IST)

    నాలుగో క్వార్టర్‌ ఆట ప్రారంభం

    భారతదేశం, అర్జెంటీనా మధ్య జరుగుతున్న మహిళల హాకీ నాలుగో క్వార్టర్‌ ఆట ప్రారంభమైంది. అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే భారత మహిళల హాకీ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశం వచ్చింది.

  • 04 Aug 2021 05:03 PM (IST)

    భారత్ 1-2తో వెనుకబడింది..

    భారతదేశం, అర్జెంటీనా మధ్య జరుగుతున్న మహిళల హాకీ రెండో సెమీ-ఫైనల్‌లో, మూడో క్వార్టర్ ఆట ముగిసింది. ప్రస్తుతం రాణి రాంపాల్ బృందానికి తదుపరి 15 నిమిషాల ఆట చాలా ముఖ్యమైంది. ఈ 15 నిమిషాల్లో భారత మహిళల హాకీ జట్టు ముందంజ వేస్తే, తొలిసారి ఒలింపిక్స్‌లో ఫైనల్ ఆడే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ భారతదేశం నుంచి గుర్జిత్ కౌర్ స్టిక్ ద్వారా వచ్చింది. కానీ తర్వాత అర్జెంటీనా కెప్టెన్ 2 గోల్స్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని సంపాదించాడు.

  • 04 Aug 2021 04:44 PM (IST)

    ఏ జట్టు గెలిచినా ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో పోటీ..

    భారత్‌, అర్జెంటీనా జట్లలో ఏది గెలిచినా ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో పోటీ ఉంటుంది. మహిళల హాకీ తొలి సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్ 5-1తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. మహిళల హాకీ చివరి మ్యాచ్ ఆగస్టు 6 న జరుగుతుంది.

  • 04 Aug 2021 04:40 PM (IST)

    2-1 ఆధిక్యంలో అర్జెంటీనా

    అర్జెంటీనా జట్టు దూకుడుగా ఆడుతోంది. ఇప్పటి వరకు అర డజను పెనాల్టీ కార్నర్‌లను పొందింది.2 గోల్స్‌ సాధించారు.రెండో క్వార్టర్‌లో మ్యాచ్‌ని సమం చేసిన తర్వాత, మూడో క్వార్టర్‌లో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. పెనాల్టీ కార్నర్‌ల ద్వారా భారత గోల్‌పోస్ట్‌లో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించింది.

  • 04 Aug 2021 04:31 PM (IST)

    మహిళల హాకీ సెమీఫైనల్‌ మ్యాచ్‌

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌, అర్జెంటీనాల మధ్య జరుగుతున్న మహిళల హాకీ సెమీఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుంది. రెండు క్వార్టర్స్‌ ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. భారత్‌ తరపున ఆట 2వ నిమిషంలో గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ అందించగా.. అర్జెంటీనా తరపున ఆట 18వ నిమిషంలో బారియోన్యూ గోల్‌ అందించింది.

  • 04 Aug 2021 04:00 PM (IST)

    మొదటి క్వార్టర్‌లో భారత్ 1-0 ఆధిక్యం

    అర్జెంటీనాతో జరిగిన తొలి క్వార్టర్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతంగా ఆడింది. దీంతో 1-0తో ఆధిక్యంలో ఉంది. మొదటి పెనాల్టీ కార్నర్‌ని గుర్జీత్ గోల్‌గా మార్చి ఆధిక్యాన్ని పెంచింది.

  • 04 Aug 2021 03:54 PM (IST)

    హాకీ (మహిళలు) మొదటి గోల్ సాధించిన భారత్

     

    భారత మహిళల హాకీ జట్టు రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ని అందుకుంది. ఆధిక్యంలోకి రావడానికి ఇంకా అవకాశం ఉంది. కీలకమైన మ్యాచ్‌లో మరోసారి గుర్జిత్ కౌర్ గోల్‌ని సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఇప్పటివరకు భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

  • 04 Aug 2021 03:50 PM (IST)

    దీపక్‌ పూనియా ఓటమి

    పురుషుల రెజ్లింగ్‌ సెమీస్‌లో దీపక్‌ పునియా ఓటమి పాలయ్యాడు. రెజ్లింగ్‌ 86 కిలోల విభాగం సెమీస్‌లో అమెరికా రెజ్లర్‌ మోరిస్‌ చేతిలో దీపక్‌ 0-10 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్‌ ఓటమి పాలైనా పతకం ఆశలు మిగిలే ఉన్నాయి. గురువారం కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాడు.

  • 04 Aug 2021 03:11 PM (IST)

    ఇండియాకి నాలుగో ఒలింపిక్స్ పతకం ఖాయం

    రెజ్లర్ రవికుమార్ ఫైనల్‌కు చేరడంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పటి వరకు మీరాభాయి చాను రజత పతకం సాధించగా..పీవీ సింధు, లవ్లీనా కాంస్య పతకాలు సాధించారు.

  • 04 Aug 2021 03:06 PM (IST)

    రెజ్లర్ రవి కుమార్ ఉడుంపట్టు.. ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం

    టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల రెజ్లింగ్‌‌లో రవి దహియా ఫైనల్‌ చేరాడు.  57 కిలోల విభాగంలో కజకిస్తాన్‌ రెజ్లర్‌ సనయెవ్‌పై 14-4తో రవి విజయం సాధించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమయ్యింది.

  • 04 Aug 2021 03:04 PM (IST)

    బాక్సర్ లవ్లీనాను అభినందించిన రాష్ట్రపతి

    ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనాను భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేస్తూ.. మీ కృషి, అంకితభావంతో దేశం మొత్తం గర్వపడేలా చేశారని కొనియాడారు.

  • 04 Aug 2021 11:36 AM (IST)

    సెమీస్‌లో లవ్లీనా ఓటమి.. భారత్‌కు మూడో పతకం

    ఎన్నో ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ లవ్లీనా నిరాశపరిచింది. తాజాగా జరిగిన 69 కేజీల బాక్సింగ్ విభాగంలోని సెమిఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. వరల్డ్ ఛాంపియన్ బుసేనాజ్ సుర్మేనెలి చేతిలో 0-5తో ఓటమిపాలైంది. దీనితో ఆమెకు కాంస్య పతకం లభించగా.. భారత్‌కు మూడో పతకం వచ్చింది.

  • 04 Aug 2021 11:07 AM (IST)

    ప్రారంభమైన మహిళల బాక్సింగ్ పోరు.. లోవ్లినాపైనే ఆశలు..

  • 04 Aug 2021 09:53 AM (IST)

    సెమీస్‌కు అర్హత సాధించిన దీపక్ పునియా

    చైనా ఆటగాడు జుషేన్ లిన్‌పై 3-6తో దీపక్ పునియా విజయం సాధించి సెమీఫైనల్ కు క్వాలిఫై అయ్యాడు.

  • 04 Aug 2021 09:51 AM (IST)

    సెమీస్‌కు అర్హత సాధించిన రవి దహియా

    బల్గేరియా ఆటగాడు జియోర్గి వంగెలోవ్‌ను 4-14 తేడాతో ఓడించి భారత స్టార్ రెజ్లర్ రవి దహియా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు.

  • 04 Aug 2021 09:21 AM (IST)

    క్వార్టర్ ఫైనల్‌కు దీపక్ పునియా

    భారత అథ్లెట్ దీపక్ పునియా 12-1 తేడాతో నైజీరియా ఆటగాడు ఎకెరేకేమె అగిమోరను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకుపోయాడు.

  • 04 Aug 2021 09:03 AM (IST)

    అన్షు మాలిక్ ఓటమి

    హోరాహోరీగా సాగిన మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్ మ్యాచ్‌లో భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ ఓటమిపాలైంది. బెలారస్‌కు చెందిన కురచకినా చేతిలో 8-2 తేడాతో ఓడిపోయింది.

  • 04 Aug 2021 08:48 AM (IST)

    రెజ్లింగ్ క్వార్టర్ ఫైనల్‌కు రవికుమార్

    ఒలింపిక్స్‌: రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరిన రవికుమార్‌.

     

  • 04 Aug 2021 08:26 AM (IST)

    పురుషుల రెజ్లింగ్ పోటీ

  • 04 Aug 2021 08:10 AM (IST)

    ప్రారంభమైన పురుషుల రెజ్లింగ్ పోటీ

  • 04 Aug 2021 08:10 AM (IST)

    ప్రారంభమైన మహిళల రెజ్లింగ్ పోటీ

  • 04 Aug 2021 08:09 AM (IST)

    ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన శివపాల్ సింగ్

    భారత అథ్లెట్ శివపాల్ సింగ్ జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. గ్రూప్ బీ విభాగంలో అతడు వరుసగా 76.40, 74.80, 74.81 మీటర్లు విసిరాడు.

  • 04 Aug 2021 08:04 AM (IST)

    జావెలిన్ త్రో.. క్వాలిఫికేషన్.. గ్రూప్-బీ

    రెండో ప్రయత్నంలో భారత అథ్లెట్ శివపాల్ సింగ్ 74.80మీటర్ల త్రో చేశాడు.

  • 04 Aug 2021 07:30 AM (IST)

    జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ బీ

    భారత అథ్లెట్ శివపాల్ సింగ్ 76.40 మీటర్లు విసిరాడు. గ్రూప్ బీ నుంచి అతడు మొదటి ప్రయత్నంలో ఇన్ని మీటర్లు విసిరాడు.

  • 04 Aug 2021 07:28 AM (IST)

    మరికాసేపట్లో మహిళల గోల్ఫ్ రౌండ్ 1 క్వాలిఫికేషన్.. సత్తా చాటేందుకు సిద్దమైన దీక్షా దగర్

  • 04 Aug 2021 07:20 AM (IST)

    నీరజ్ చోప్రా అద్భుతమైన త్రోపై మీరూ లుక్కేయండి

  • 04 Aug 2021 06:58 AM (IST)

    ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా

    83.50 మీటర్ల త్రో ద్వారా మొదటి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

  • 04 Aug 2021 05:50 AM (IST)

    మహిళల గోల్ఫ్ రౌండ్ 1 మరికాసేపట్లో ప్రారంభం కానుంది

  • 04 Aug 2021 05:45 AM (IST)

    ఆగష్టు 4న భారత ఆటగాళ్లు షెడ్యూల్ ఇదే

  • 04 Aug 2021 05:45 AM (IST)

    పురుషుల జావెలిన్ త్రో పోటీలో రంగంలోకి దిగనున్న నీరజ్ చోప్రా

Follow us on