Avani Lekhara: పారాలింపిక్స్‌లో అవని లేఖరా సంచలన ప్రదర్శన.. ఇప్పటికే ఖాతాలో రెండు మెడల్స్.. మరొకటి

|

Sep 03, 2021 | 6:59 PM

మహిళల షూటింగ్​ ఆర్​8 50మీ. రైఫిల్​ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. అంతకుముందు ఈమె.. ఆర్​2 10 మీ. ఎయిర్​ రైఫిల్​ విభాగంలో బంగారు పతకం సాధించడం విశేషం.

Avani Lekhara: పారాలింపిక్స్‌లో అవని లేఖరా సంచలన ప్రదర్శన.. ఇప్పటికే ఖాతాలో రెండు మెడల్స్.. మరొకటి
Avani Lekhara
Follow us on

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వారి అద్భుత ఆటతీరుతో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ముఖ్యంగా 19ఏళ్ల జైపూర్‌ క్రీడాకారిణి అవని లేఖరా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఘనత సాధించింది. రెండ్రోజుల క్రితం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం సాధించింది అవని. తాజాగా మహిళల షూటింగ్‌ 50మీటర్ల ఎస్‌హెచ్‌1 విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. ఐతే ఆమె తలపడాల్సిన మరో ఈవెంట్ ఉంది. ఇందులో కూడా ఆమె పతకాన్ని సాధిస్తే, ఒకే పారాలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కుతుంది. 2012లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ లో వెన్నుపూస విరిగి చక్రాల కుర్చీకే పరిమితమైంది అవని. కానీ ఏమాత్రం కుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగి ఇప్పుడు పారాలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. అందరిచేతా శభాష్‌ అనిపించుకుంటోంది. అవని కృషి, టాలెంట్‌ను చూసి హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఆమెకు అభినందనలు తెలిపారు.

“పారాలింపిక్స్​కు మరింత కళ వచ్చింది. అవని లేఖరా ప్రదర్శన చూసి సంతోషం వేస్తోంది. కాంస్య పతకం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్​లో మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నా” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు తన జీవితం అందరికీ స్ఫూర్తిని పంచాలని కోరుకుంటున్నట్లు తెలిపింది అవని. తాను సాధించిన పతకం కనీసం ఒకరినైనా ప్రేరేపించగలిగితే, అది తనకు చాలా సంతోషమని పేర్కొంది. ఇక ఇవాళ పారాలింపిక్స్‌లో మరో పతకం సాధించాడు ప్రవీణ్‌కుమార్‌. హైజంప్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు. దీంతో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రవీణ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.

ఆర్చరీ  వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో  హర్విందర్‌ సింగ్‌‌కు కాంస్యం

పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం లభించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. కొరియన్‌ అథ్లెట్‌ కిమ్‌తో కాంస్య పోరులో పోటీపడిన హర్విందర్‌ 6-5(10-8) తేడాతో గెలుపొందాడు.  అంతకుముందు సెమీఫైనల్స్‌లో అమెరికా అథ్లెట్‌ కెవిన్‌ మాదర్‌ చేతిలో 6-4 తేడాతో హర్విందర్​ ఓటమిపాలయ్యాడు. ఇది వరకు 2018 ఆసియా పారా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సాధించిన హర్విందర్‌ ఇప్పుడు విశ్వ క్రీడల్లోనూ టాలెంట్ చూపించాడు.దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరింది. అందులో రెండు స్వర్ణాలు, 6 రజతాలతో పాటు 5 కాంస్య పతకాలున్నాయి.

Also Read: ‘జగనన్న విద్యా దీవెన’పై హైకోర్టు కీలక తీర్పు.. ఇకపై డబ్బు వారి అకౌంట్లలోకే

సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు.. గుండె తరుక్కుపోయే సీన్..