Brisbane Olympics 2032: బ్రిస్బేన్‌లోనే 2032 ఒలింపిక్ గేమ్స్.. ప్రకటించిన ఐఓసీ

|

Jul 22, 2021 | 7:31 AM

టోక్యో ఒలింపిక్స్ రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2032లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన ఓ ప్రకటన చేసింది.

Brisbane Olympics 2032: బ్రిస్బేన్‌లోనే 2032 ఒలింపిక్ గేమ్స్.. ప్రకటించిన ఐఓసీ
Brisbane Olympics 2032
Follow us on

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2032లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో ఒలింపిక్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, 2000 సంవ‌త్స‌రంలో సిడ్నీలో ఒలింపిక్స్ జ‌రిగాయి. దీంతో 32 ఏళ్ల త‌ర్వాత‌.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్ పోటీలు జరగనున్నాయి. అంతకుముందు 1956 మెల్‌బోర్న్ నగరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగియి. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాట్లాడుతూ.. 2032 ఒలింపిక్ క్రీడల హక్కలు మా దేశానికి దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 ఓట్లు పోల‌య్యాయి. దీంతో ఐఓసీ బ్రిస్బేన్‌ను ఎంచుకుంది. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ త‌ర్వాత‌ 2024 ఒలింపిక్ క్రీడలు పారిస్‌‌లో జరగనున్నాయ. అలాగే 2028 ఒలింపిక్స్‌ లాస్ ఏంజిల్స్‌ నగరంలో జరగనున్న సంగతి తెలిసిందే.

జులై 23 నుంచి టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు సత్తాచాటేందుకు రానున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న క్రీడాకారులు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ఆగస్టు 8 వరకు జరిగే ఈ క్రీడలకు భారత్ నుంచి 119మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కేసులు బయటపడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 11,500 మంది అథ్లెట్లు, సుమారు 79,000 మంది నిర్వహాకులు, సహాయక సిబ్బంది, మీడియా సిబ్బంది ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఉండనున్నారు. ఈమేరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నిర్వాహాకులు భయపడుతున్నారు. క్రీడా గ్రామంలోని వారందరికీ ప్రతిరోజూ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్లాన్ చేస్తోంది. అంటే దాదాపు ప్రతిరోజూ 80,000 మందికి కోవిడ్-19 పరీక్షలు చేయనున్నారు. పరీక్షల కోసం 230 మంది డాక్టర్లు, 310 మంది నర్సులను ఏర్పాటు చేశారు.

Also Read:

Viral Video: పోటీలో పాల్గొనలేదు.. కానీ, అందరి కంటే ముందే గమ్యాన్ని చేరాడు..! వైరలవుతోన్న వీడియో

Viral Video: మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి..! నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న జిల్, ఫిల్ వీడియో