Neeraj Chopra: నీరజ్ భాయ్‌కి గోల్డెన్ పాస్ ఇవ్వడం కాదు.. లోకల్ అథ్లెట్లను ఆదుకోండి.. కేఎస్ఆర్‌టీసీ ఆఫర్‌పై నెటిజన్ల ట్రోల్స్..!

|

Aug 11, 2021 | 1:04 PM

నీరజ్ చోప్రా... టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు త్రో విసిరి అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Neeraj Chopra: నీరజ్ భాయ్‌కి గోల్డెన్ పాస్ ఇవ్వడం కాదు.. లోకల్ అథ్లెట్లను ఆదుకోండి.. కేఎస్ఆర్‌టీసీ ఆఫర్‌పై నెటిజన్ల ట్రోల్స్..!
Neeraj Chopra Biopic
Follow us on

Neeraj Chopra: నీరజ్ చోప్రా… టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు త్రో విసిరి అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు పలు సంస్థలు నీరజ్‌కు బహుమానాలతోపాటు పలు ఉచిత ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (KSRTC) కూడా చేరింది. అయితే దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో కేఎస్‌ఆర్‌టీసీ అపహాస్యం అయింది. అసలు విషయానికి వెళ్తే.. బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు కేఎస్ఆర్‌టీసీ ఉచితంగా జీవిత కాలం ‘గోల్డెన్ బస్‌ పాస్’ ప్రకటించింది. ఈమేరకు శనివారం కేఎస్ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శివయోగి సి కలసద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మిస్టర్ నీరజ్ చోప్రాకు అభినందనలు. అతని విజయానికి గుర్తుగా కేఎస్ఆర్‌టీసీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నీరజ్‌కు గోల్డెన్ బస్ పాస్ అందిస్తున్నాం’ అంటూ అందులో పేర్కొన్నారు.

అయితే నీరజ్ హర్యానాలోని పానిపట్‌లో ఉంటాడు. బెంగళూరులో అతనికి ఉచిత బస్ పాస్ అందించడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. అలాగే అసలు చోప్రాకు ఈ బస్‌పాస్ అవసరం ఉందని అనుకుంటున్నారా. అసలు అతను ఈ గోల్డెన్ బస్‌పాస్‌ను ఉపయోగిస్తాడని మీరు అనుకుంటున్నారా అంటూ కేఎస్ఆర్‌టీసీ అధికారులను ట్రోల్ చేశారు. ఇలాంటి ఇచ్చే బదులు లోకల్‌గా ఉండే క్రీడాకారులకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తే.. ఎంతో ఉపయోగంగా ఉంటుందంటూ సలహాలు కూడా ఇచ్చారు.

ఈ ట్రోల్స్‌పై కేఎస్ఆర్‌టీసీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..’ఇది అతని విజయానికి గుర్తుగా అందించిన బహుమతి. గతంలో అర్జున అవార్డు, ఒలింపియన్లు, పారా ఒలింపియన్లతో సహా పలువురి క్రీడాకారులకు మేం ఉచిత బస్‌పాస్‌లు అందించాం’ అంటూ పేర్కొ్న్నారు. అలాగే మహిళల వ్యక్తిగత గోల్ఫ్ టోర్నమెంట్‌లో నాల్గవ స్థానంలో నిలిచిన తరువాత ఒలింపిక్ పతకాన్ని తృటిలో కోల్పోయిన గోల్ఫో క్రీడాకారిణి అదితి అశోక్‌కు కూడా కేఎస్‌ఆర్‌టీసీ ఉచిత జీవితకాల పాస్‌ను ప్రకటించింది.

రాఘవేంద్ర అనే ట్విట్టర్ యూజర్ ఒకరు కామెంట్ చేస్తూ..’మొదట ఉద్యోగుల జీతం పెంచండి. నీరజ్ భాయ్‌కూడా సంతోషంగా ఉంటాడు. కేవలం అర్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు మాత్రమే ఈ సంస్థను 60 ఏళ్లుగా నిర్మించలేదు. డ్రైవర్లు, కండక్టర్లతోపాటు మెకానిక్‌లకు అందులో భాగం ఉంది. వారికేమో సరైన జీతాలు అందించరు అంటూ’ ఘాటుగా ట్వీట్ చేశాడు.

Also Read: 70 బంతుల్లో 7గురు బౌలర్ల భరతం పట్టాడు..! 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 140 పరుగులు చేశాడు.. ప్రత్యర్థికి దడ పుట్టించాడు..

‘ప్రపంచ నాయకుల్లారా.. మాకు శాంతి కావాలి.. మమ్మల్ని గందరగోళంలోకి నెట్టొద్దు’: స్టార్ ఆల్ రౌండర్ విజ్ఞప్తి