PV Sindhu: పీవీ సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పి.. ఘనంగా సన్మానించిన హైదరాబాద్ పోలీసులు

| Edited By: Ravi Kiran

Aug 11, 2021 | 8:18 AM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. బాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పిన హైదరాబాద్ పోలీసులు.. ఘనంగా సన్మానించారు.

PV Sindhu: పీవీ సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పి.. ఘనంగా సన్మానించిన హైదరాబాద్ పోలీసులు
Pv Sindhu
Follow us on

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. బాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పిన హైదరాబాద్ పోలీసులు.. ఘనంగా సన్మానించారు. అశ్వాలతో కవాతు నిర్వహించి పోలీస్ కమిషనరేట్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ అంజనీ కుమార్ శుభాకాంక్షలు చెబుతూ లోపలికి ఆహ్వానించారు. ఆమె వెంట సింధు తండ్రి పీవీ రమణ కూడా హాజరయ్యారు.

కమిషనర్ ఆఫీసులో ఒలింపిక్ కాంస్య విజేతను, ఆమె తండ్రి రమణను పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం కరోనా సెకండ్ వేవ్ టైంలో పోలీసులు అందించిన సేవలపై రూపొందించిన ‘ది సెకండ్ వేవ్’ పుస్తకాన్ని పీవీ సింధు ఆవిష్కరించారు.

అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి మరింత పేరు తెచ్చారని, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ వరుసగా రెండోసారి పతకం సాధించడం మాములు విషయం కాదంటూ’ వెల్లడించారు.

పీవీ సింధు మాట్లాడుతూ, ‘తాను సాధించిన పతకాన్ని పోలీసుల సేవలకు అంకితమిస్తున్నానని, కరోనా సమయంలో పోలీసులు ఉత్తమ సేవలందించారని’ అభినందించారు.

Also Read: 19 బంతుల్లో హ్యాట్రిక్‌తో సహా 5 వికెట్లు.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. అతనెవరంటే?

Viral Video: ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే! వైరలవుతోన్న నీరజ్ చోప్రా వీడియో