Kaylee McKeown: పట్టరాని సంతోషంలో నోరు జారిన మహిళా స్విమ్మర్‌.. వెంటనే నాలుక కరుచుకొని.. వైరల్‌గా మారిన మీడియా.

|

Jul 28, 2021 | 12:02 PM

Kaylee McKeown: జీవితంలో బాధను ఎలా అయితే భరించలేమో.. కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని కూడా తట్టుకోలేము. పట్టరాని సంతోషంలో కొన్ని సార్లు కన్నీళ్లు కూడా వస్తుంటాయి. దీనిని మనలో...

Kaylee McKeown: పట్టరాని సంతోషంలో నోరు జారిన మహిళా స్విమ్మర్‌.. వెంటనే నాలుక కరుచుకొని.. వైరల్‌గా మారిన మీడియా.
Kaylee Mckeown
Follow us on

Kaylee McKeown: జీవితంలో బాధను ఎలా అయితే భరించలేమో.. కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని కూడా తట్టుకోలేము. పట్టరాని సంతోషంలో కొన్ని సార్లు కన్నీళ్లు కూడా వస్తుంటాయి. దీనిని మనలో చాలా మంది అనుభవించే ఉంటారు. ఇక పట్టరాని సంతోషంలో కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతుంటాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా స్విమ్మర్‌ కూడా ఇలాగే సంతోషం ఎక్కువయ్యేసరికి నోరు జారింది. తాను తప్పుగా మాట్లాడుతున్నాని గ్రహించు వెంటనే నాలుక కరుచుకుంది.

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన కైలీ మెక్‌కీన్ అనే స్విమ్మర్‌ తాజాగా జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె 100 బ్యాక్‌స్ట్రోక్‌ను కేవలం 57.47 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ రికార్డుతో ఆమె గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కైలీని ఓ మీడియా ప్రతినిధి.. గోల్డ్‌ మెడల్‌ గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్‌ అవుతున్నారని ప్రశ్నించాడు. దీంతో సంతోషంలో మునిగితేలుతోన్న కైలీ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను అనేసింది. అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి వెంటనే టాపిక్‌ను డైవర్ట్‌ చేసి చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే కైలీ మెక్‌కీన్‌ ఒలంపిక్స్‌లో మెడల్‌ సాధించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్‌ గెలుచుకొని రికార్డు సృష్టించింది.

Also Read: హాట్ షాట్స్ తో లింక్ లేదన్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ..కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ లోనూ రాజ్ కుంద్రా ఖాతాలు

Viral News: సమోసా ధర విషయంలో గొడవ.. ఓ వ్యక్తి బలవన్మరణానికి కారణమైన 5 రూపాయలు

Sharwanand : డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌తో రానున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మూవీ….