Tilak Varma: అహ్మదాబాద్ గడ్డపై తెలుగోడి గర్జన.. తొలి సెంచరీతో దుమ్మురేపిన తిలక్..

Tilak Varma Century: తెలుగబ్బాయ్ తిలక్ వర్మ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై కుర్రాడు తిలక్ వర్మ 45 బంతుల్లో 101 పరుగులు చేసి, IPLలో తన తొలి సెంచరీని నమోదు చేశాడు.

Tilak Varma: అహ్మదాబాద్ గడ్డపై తెలుగోడి గర్జన.. తొలి సెంచరీతో దుమ్మురేపిన తిలక్..
Gt Vs Mi Tilak Varma Century

Updated on: Apr 20, 2026 | 9:32 PM

Tilak Varma Century: ఐపీఎల్ 19వ సీజన్‌లోని 30వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ తన తొలి ఐపీఎల్ సెంచరీని సాధించాడు. అతను 45 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. నమన్ ధీర్ కూడా 45 పరుగులు చేశాడు.

గుజరాత్ టైటాన్స్ తరపున కగిసో రబాడా మూడు వికెట్లు తీసుకున్నాడు. అతను పవర్‌ప్లేలో సూర్యకుమార్ యాదవ్ (15 పరుగులు), క్వింటన్ డి కాక్ (13 పరుగులు), అరంగేట్రం చేసిన డానిష్ మలేవార్ (2 పరుగులు)లను ఔట్ చేశాడు.

IPLలో MI తరపున అత్యంత వేగవంతమైన శతకాలు (బంతుల పరంగా):

45 – సనత్ జయసూర్య vs CSK, ముంబై, 2008

45 – తిలక్ వర్మ vs GT, అహ్మదాబాద్, 2026

47 – కామెరాన్ గ్రీన్ vs SRH, ముంబై (వాంఖేడే), 2023

49 – సూర్యకుమార్ యాదవ్ vs GT, ముంబై, 2023

51 – సూర్యకుమార్ యాదవ్ vs SRH, ముంబై, 2024

52 – రోహిత్ శర్మ vs KKR, కోల్‌కతా, 2012

IPLలో తిలక్ వర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:

101* (MI తరపున) vs GT, అహ్మదాబాద్, 2026

84* (MI తరపున) vs RCB, బెంగళూరు, 2023

65 (MI తరపున) vs RR, జైపూర్, 2024

ఇరు జట్లు:

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఏఎమ్ ఘజన్‌ఫర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us