Cricket Betting: అనుమతి లేకుండానే స్టేడియంలోకి వెళ్లారు.. ఆపై వారు చేసిన పనికి అరెస్టయ్యారు..

|

Feb 07, 2021 | 11:25 PM

Cricket Betting: బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా ఛట్టోగ్రమ్‌లోని జహూర్ అహ్మద్ చౌదురి స్టేడియంలో బెట్టింగ్‌లకు..

Cricket Betting: అనుమతి లేకుండానే స్టేడియంలోకి వెళ్లారు.. ఆపై వారు చేసిన పనికి అరెస్టయ్యారు..
Follow us on

Cricket Betting: బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా ఛట్టోగ్రమ్‌లోని జహూర్ అహ్మద్ చౌదురి స్టేడియంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు భారతీయులను ఆదేశ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారిక సమాచారం ప్రకారం.. జహూర్ అహ్మద్ చౌదురి స్టేడియం వేదికగా బంగ్లాదేశ్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్‌‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలా వచ్చారో గానీ.. స్టేడియంలోకి వచ్చారు. మ్యాచ్‌ జరుగుతుండగా ఏవేవో సైగలు చేస్తున్నారు.

వీరిని గమనించిన మ్యాచ్ నిర్వాహకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎంటరైన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. నిందితులు ముగ్గురు ఇండియన్స్ అని, సునీల్ కుమార్, చేతన్ శర్మ, సన్నీ మఘు అని పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు.. ఈ ముగ్గురు వ్యక్తులు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దాంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు.

Also read:

Road Accident: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఢీకొన్న ఆటో, లారీ.. ఐదేళ్ల చిన్నారి మృతి..

రేపు చెన్నైకు చేరుకోనున్న చిన్నమ్మ.. శశికళకు స్వాగతం పలికేందుకు అభిమానుల భారీ ఏర్పాట్లు