ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ కు చేరింది. సూపర్-12లో భారత్ తో తొలి మ్యాచ్ ఓడిపోవడం, ఆ తర్వాత జింబాబ్వేపై కూడా ఓటమి చవిచూడటంతో పాకిస్తాన్ ఇంటిముఖం పడుతుందని అంతా భావించారు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అయితే కొన్ని మిరాకిల్స్ జరగడంతో అనుహ్యంగా పాకిస్తాన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. నెదార్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాప్రికా ఓటమి చవిచూడటంతో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ దక్షిణాఫ్రికా జట్టుపై వ్యంగాస్త్రాలు సంధించారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఓడి తమకు సెమీస్‌కు చేరే అవకాశాలను బలపరచారంటూ సౌతాఫ్రికా జట్టుకు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే కీలక సమయంలో తడబాటుకు గురై నిరాశపరుస్తారనే పేరును సార్థకం చేసుకున్నారంటూ వ్యంగాస్త్రాలు సంధించాడు. ఏదేమైనా తమ చిరకాల ప్రత్యర్థితో మరోసారి తలపడే అవకాశం కల్పించారంటూ వ్యాఖ్యానించాడు.
బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఓ వీడియో సందేశాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు అక్తర్. తాను ఇప్పుడే నిద్రలేచానని, దక్షిణాఫ్రికా జట్టుకు కృతజ్ఞతలంటూ ఆ వీడియోలో తెలిపాడు. మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడంలో మీరు గొప్పవారు. కానీ పాకిస్థాన్‌కు మీ ద్వారా మరో గొప్ప అవకాశం లభించింది అని వ్యాఖ్యానించాడు. జింబాబ్వేతో ఓటమి తర్వాత సెమీ ఫైనల్స్‌కు పాక్ దాదాపుగా దూరమైంది. ఇప్పుడు మీ వల్ల ఒక లైఫ్‌లైన్ లభించింది. మేం టీమ్‌ఇండియాను మరోసారి కలుసుకోవాలనుకుంటున్నాం అంటూ తన సందేశంలో పేర్కొన్నాడు.
పాకిస్థాన్.. ఇప్పుడు దృఢంగా ఆడండి. వెళ్లి కప్ గెలుచుకురండి అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ గెలుపొందగా, జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందే టీమ్‌ఇండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి పాకిస్తాన్ కూడా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.
Thank you South Africa. You’ve lived upto the ‘c’ word. Worked in our benefit.
Pakistan, now stay tight. Go on & win this. pic.twitter.com/MCl1oz6ZHC— Shoaib Akhtar (@shoaib100mph) November 6, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..