Syed Mushtaq Ali Trophy: నరాలు తెగిపోయే ఉత్కంఠ.. చివరి బంతి వరకు ఇరు జట్లను దోబూచులాడే విజయం.. ప్రతీ టీ20 మ్యాచ్‌లో ఈ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. మహేంద్ర సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్‌మన్ విష్ణు సోలంకి చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా టీమ్.. టార్గెట్‌ను చేధించే క్రమంలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. వన్‌డౌన్‌లో వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఒక తరుణంలో బరోడా జట్టు ఈజీగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉండగా.. హర్యానా బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో.. చివరి ఓవర్‌కు 18 పరుగులు కావాల్సి వచ్చింది. 1..1..1..6..4.. చివరి ఓవర్ మొదటి ఐదు బంతులు 13 పరుగులు రాబట్టిన విష్ణు సోలంకి లాస్ట్ బాల్‌లో ధోనిని తలుచుకుని హెలికాప్టర్ సిక్స్‌తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
Vishnu Solanki’s match-winning 71* (46) https://t.co/uBESin7yMu via @bcci
— varun seggari (@SeggariVarun) January 27, 2021