కోహ్లీ రికార్డు‌ను బ్రేక్ చేసిన స్మిత్!

|

Aug 03, 2019 | 12:35 AM

బర్మింగ్‌హామ్: బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో తన రీ-ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీ(144) చేశాడు. స్మిత్‌కు ఇది 24వ సెంచరీ కాగా.. 118 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం. అందులోనూ తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో […]

కోహ్లీ రికార్డు‌ను బ్రేక్ చేసిన స్మిత్!
Follow us on

బర్మింగ్‌హామ్: బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో తన రీ-ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీ(144) చేశాడు. స్మిత్‌కు ఇది 24వ సెంచరీ కాగా.. 118 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం. అందులోనూ తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లను అధిగమించాడు. ఇక లిస్ట్‌లో డాన్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డాన్ బ్రాడ్‌మన్..66 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ 123 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ 125 ఇన్నింగ్స్‌లోనే ఆ ఘనత సాధిచాడు.