నిరాశతో.. రిటైర్మెంట్‌ ప్రకటించిన మిస్టరీ స్పిన్నర్

| Edited By:

Aug 29, 2019 | 2:28 PM

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంత మెండిస్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చివరిసారిగా అతడు 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మెండిస్‌ 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడు 288 వికెట్లు సాధించాడు. కెరీర్ స్టార్టింగ్‌లో […]

నిరాశతో.. రిటైర్మెంట్‌ ప్రకటించిన మిస్టరీ స్పిన్నర్
Ajantha Mendis retires from all forms of cricket
Follow us on

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంత మెండిస్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చివరిసారిగా అతడు 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం.

ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మెండిస్‌ 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడు 288 వికెట్లు సాధించాడు. కెరీర్ స్టార్టింగ్‌లో అతడి మిస్టరీ బౌలింగ్‌ను చూసి ముత్తయ్య మురళీధరన్‌ స్థాయికి ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. అరంగేట్రం టెస్టులోనే మెండిస్‌ 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తొలి వన్డేలో 3, తొలి టీ20లో 4 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్‌లో రెండుసార్లు 6 వికెట్ల ఘనత సాధించిన అరుదైన రికార్డు సాధించాడు మెండిస్‌.