
వెస్టిండీస్ టూర్‌కి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్ల కూర్పుపై భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు ఏ ఫార్మాట్‌లోకి తీసుకోకపోవడం, సీనియర్, స్టాండర్డ్ ప్లేయర్ అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్ గిల్, అజింక్య రెహానేను వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అన్ని ఫార్మెట్లలో ఆడగలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని..వారిని ఎంపిక చేస్తే ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. కేవలం కొంతమంది ఆటగాళ్లను మాత్రమే మూడు ఫార్మెట్లలో ఆడుతున్నారని పేర్కొన్నారు. అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయడం సరికాదని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించిన జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.